Home » Ponguleti Srinivasa Reddy
Telangana: పదేళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన బీజేపీ తెలంగాణకు చేసింది ఏమి లేదని.. రాష్ట్రానికి ఇచ్చింది ‘‘గాడిద గుడ్డు’’ మాత్రమే అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాముల వారిని కూడా బీజేపీ రాజకీయాల్లోకి తెచ్చిందని విమర్శించారు. తలంబ్రాల పేరుతో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కలలుకంటోందన్నారు.
Telangana: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. మతతత్వం రెచ్చగొట్టే బీజేపీకి కానీ, మాయ మాటలు చెప్పే బీఆర్ఎస్కు ఓటు వేయొద్దని కోరారు. రాష్ట్రంలో లక్ష 50 వేల కోట్ల రూపాయలు దోచుకున్న ప్రభుద్దుడు కేసీఆర్ అని ఆరోపించారు.
దేశంలో అతిపెద్ద అవినీతి పార్టీలుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గుర్తింపు పొందాయని, ఎన్నికల బాండ్ల పేరుతో జరిగిన అవినీతిలోనే ఇది రుజువైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,
మాయమాటలు చెప్పటం తప్పా ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) దేశానికి ఏం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ప్రశ్నించారు. సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేరు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో గల పాలకులు జైలుకు వెళ్లడం ఖాయం అని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు.
దేవుడు అయిన రాముడినీ సైతం బ్యాలెట్ బాక్స్‌లోకి తీసుకురావడం చాలా సిగ్గుచేటని.. ఆ దౌర్భాగ్య స్థితికి బీజేపీ (BJP) తెరలేపిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఆరోపించారు. ప్రధానమంత్రి స్థానంలో ఉండి నరేంద్రమోదీ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు.
ఖమ్మం సీటుపై మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన వియ్యంకుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామరెడ్డిని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్ఠానం నిర్ణయించింది. ఖమ్మం సీటుకు
చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద నలుగుతున్న మూడు స్థానాలపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేటికీ పెండింగ్‌లో పెట్టింది. ఆయా స్థానాల్లో కీలక నేతలు తమ వారికి కావాలంటే తమ వారికి కావాలంటూ పట్టుబట్టి కూర్చున్నారు.
ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థిపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ ఎన్నికల బరిలో దిగేందుకు పార్టీలోని పలువురు నాయకులు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా ఖమ్మం లోక్‌సభ స్థానం అభ్యర్థి అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.
ఖమ్మం లోక్‌సభ టికెట్ పంచాయతీ బెంగుళూరు చేరింది. ఖమ్మం సీటు విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం సీటు విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని పట్టుబడుతున్నారు. తన భార్య నందినికి కాకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబడుతున్నారు.