Share News

No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం

ABN , Publish Date - Apr 06 , 2025 | 07:41 PM

No Exam: ప్రస్తుతమంతా పోటీ ప్రపంచం. చిన్న ఉద్యోగానికి సైతం లక్షలాది మంది దరఖాస్తు చేసుకొంటున్నారు. అలాంటి వేళ.. ఉద్యోగం లేకుండా కేవలం అర్హత ఆధారంగా ఉద్యోగాలను నియమిస్తున్నారు. అది కూడా నెలకు దాదాపు రూ. 2 లక్షల జీతం. ఇటువంటి సదావకాశాన్ని నిరుద్యోగులు వినియోంచుకొంటే.. వారి భవిష్యత్తు బంగారమయం అవుతుంది.

No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం
No Exam

మీరు బ్యాంకు ఉద్యోగం చేయాలనుకొంటున్నారా?. ఈ ఆశయంతో బ్యాంక్ పరీక్షలకు సిద్దమవుతున్న వారికి ఇది శుభవార్త. IDBI బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2025 కింద ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. అందుకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఏప్రిల్ 7వ తేదీ అంటే.. సోమవారం నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అందుకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా బ్యాంకులో ఉద్యోగం లభించనుంది. ఇక దరఖాస్తు చేసే ముందు ఈ కింది సమాచారాన్ని చదవండి..

బ్యాంక్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఐడీబీఐ ఆహ్వానించింది. ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు IDBI బ్యాంక్ అధికారిక వెబ్ సైట్‌ idbibank.inలోకి వెళ్లి.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ఏప్రిల్ 7 నుంచి దరఖాస్తుల స్వీకరణ..

ఈ ర్రికూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న వారు.. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 7వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ముందుగా ఈ సమచారాన్ని చదవాలి.

మొత్తం ఖాళీలు:

  • డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM) గ్రేడ్ D - 8 పోస్టులు

  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) గ్రేడ్ C - 42 పోస్టులు

  • మేనేజర్ గ్రేడ్ బి - 69 పోస్టులు

ఈ పోస్టులను భర్తీ చేయనుంది.


ఈ బ్యాంక్‌లో ఉద్యోగం పొందడానికి అర్హత ప్రమాణాలు:

  • IDBI బ్యాంక్‌లో ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే ఎవరైనా అధికారిక నోటిఫికేషన్‌లో ఇవ్వబడిన సంబంధిత అర్హతను కలిగి ఉండాలి.

  • ఈ బ్యాంక్‌కి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వర్తించే వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి రుసుము ఎంతంటే..

జనరల్/ ఇడబ్ల్యుఎస్/ ఓబిసి అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: - రూ. 1050

SC/ST అభ్యర్థులకు దరఖాస్తు రుసుము - రూ. 250

అభ్యర్థులు తమ.. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IMPS లేదా మొబైల్ వాలెట్ ద్వారా చెల్లించ వచ్చు)

అప్లికేషన్ లింక్ మరియు నోటిఫికేషన్ కోసం ఇక్కడ చూడండి:

IDBI బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం దరఖాస్తు చేసుకోవడానికి లింక్


IDBI బ్యాంక్‌లో ఎంపిక ప్రక్రియ:

  • అభ్యర్థులను బహుళ దశల ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు.

  • మెరిట్ ఆధారంగా ప్రారంభ షార్ట్‌లిస్ట్ (వయస్సు, అర్హత, అనుభవం మొదలైన వాటి ఆధారంగా) డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతోంది.

  • అలా ఎంపికైన అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్‌తోపాటు పర్సనల్ ఇంటర్వ్యూ (PI)కు పిలుస్తారు.

  • ఎంపిక పూర్తిగా అర్హతలతోపాటు అనుభవం ఆధారంగా ఉంటుంది.

For More News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 09:53 PM