TG News: బౌద్ధ స్థూపాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం, మంత్రులు జూపల్లి, పొంగులేటి..
ABN , Publish Date - Aug 12 , 2024 | 12:09 PM
ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలలను ప్రపంచ పటంలో ఉంచాలని, వాటిని ప్రాచుర్యంలోకి టీసుకొచ్చి బుద్దిస్ట్‌లను ఇక్కడికి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం పాలేరు నియోజకవర్గం, నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ స్థూపాన్ని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు.
ఖమ్మం జిల్లా: తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలలను (Tourist places) ప్రపంచ పటం (World Map)లో ఉంచాలని, వాటిని ప్రాచుర్యంలోకి టీసుకొచ్చి బుద్దిస్ట్‌లను (Buddhist) ఇక్కడికి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) సూచించారు. సోమవారం పాలేరు నియోజకవర్గం, నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ స్థూపాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. బుద్దిస్టుల కార్యక్రమం ఏర్పాటు చేసి ఆహ్వానించాలని, వారి సూచనలు, సలహాలు తీసుకుని.. టూరిజం అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందన్నారు. దీనికి సంబంధించి నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆర్కిలజీకల్ సైట్‌గా చేయాలని, పాత ఆరామాలను పునఃప్రారంభం చేయాలని, వసతులు, ప్రొటెక్షన్, ఏర్పాటు చేయాలన్నారు. . టూరిజం, ఆర్కియాలజీ ఇద్దరు సమన్వయంతో కలిసి పని చేయాలని, బుద్దిస్టులకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
బౌద్ధ స్థూపంకు పూర్వ వైభవం తీసుకురావాలి: మంత్రి జూపల్లి..
ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) బౌద్ధ స్థూపం వద్ద పర్యాటక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బౌద్ధ స్థూపంను పర్యాటకులకు అందించేందుకు ఏం చేద్దాం?.. ఎందుకు ఇంత కాలం నిర్లక్ష్యం చేశారు?.. ముఖ్యమైన బౌద్ధ స్థూపంకు పూర్వ వైభవం తీసుకురావాలని, 8 ఎకరాలను అభివృద్ధి చేయాలని, స్థూపంకు లైటింగ్, నీటి లభ్యత, బోటింగ్ ఏర్పాటుకు సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. తెలంగాణలో బౌద్ధ స్థలాలు ఉన్నాయని, మూడు స్థలాల్లో పాలేరు కీలకమైనదని అన్నారు. అయితే సిబ్బంది కొరత, బడ్జెట్ లేదని మంత్రులకు అధికారులు వెల్లడించారు.
కాంగ్రెస్ హయాంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి: మంత్రి పోంగులేటి
దేశంలోనే నేలకొండపల్లి బౌద్ధ స్థూపంకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, కాంగ్రెస్ హయాంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి జరిగిందని, నేలకొండపల్లి బోద్దస్థూపం అండర్ గ్రౌండ్‌లో ఇంకా స్థూపాలున్నాయని మంత్రి పోంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. టూరిజంలో బెస్ట్ ప్లేస్‌గా నేలకొండపల్లిని తీర్చిదిద్దాలన్నారు. నేలకొండపల్లిలో భక్తరామదాసు నివసించిన ఇంటిని మ్యూజియంగా మార్చాలన్నారు. పాలేరు నియోజకవర్గంలో రిజర్వాయర్ అభివృద్ది చేయాలని మంత్రి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆగష్టు 15న అన్న క్యాంటిన్లు రీఓపెన్
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే ఇదేనేమో..
సైబర్ నేరగాళ్లపై పోలీసుల ఫోకస్
ఇప్పటికీ జగన్‌కు జై కొడుతున్న కొందరు పోలీస్ బాస్‌లు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News