Home » Prakasam
ప్రకాశం బ్యారేజీలో మరో సిమెంటు దిమ్మె (కౌంటర్ వెయిట్) దెబ్బతిన్నట్లు గుర్తించారు. 67, 68, 69 నంబరు ఖానాలతో పాటు 66వ ఖానా వద్ద ఉన్న దిమ్మె కూడా దెబ్బతిందని.. పగుళ్లు ఉన్నాయని బెకెమ్ కంపెనీ బృందం గురువారం గుర్తించింది.
Andhrapradesh: ఒంగోలులో శిశువు విక్రయం తీవ్ర కలకలం రేపింది. ఒంగోలు రిమ్స్‌లో పది వేలకు కన్న కూతురుని విక్రయించిన అంగన్వాడీ కార్యకర్త మంజుల. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరుకి చెందిన బాలసుందరరావుకి మధ్యవర్తుల ద్వారా చిన్నారిని విక్రయించింది. పాపని అమ్మిన తర్వాత అంగన్వాడీ కార్యకర్త రిమ్స్‌లో కనిపించకుండా పోయింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అమెరికాలోని ఓ బీచ్‌లో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు. ముండ్లమూరుకు చెందిన దద్దాల కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మల ఏకైక కుమారుడు దద్దాల బుచ్చిబాబు(40) ఎంసీఏ పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి(Dola Sree Bala Veeranjaneya Swamy)కి ప్రమాదం తృటిలో తప్పింది. జరుగుమల్లి మండలం పాలేటిపాడు (Paletipadu)లో పోలేరమ్మ తిరుణాళ్ల కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి డోలా వెళ్లారు.
కనిగిరి మండలం పునుగోడు ఎస్టీ కాలనీ వద్ద ముగ్గురు యువకులు మృతిచెందడంపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ద్విచక్రవాహనం విద్యుత్ తీగలు తెగిపడి ముగ్గురు విద్యార్థులు చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసినట్లు మంత్రి గొట్టిపాటి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే మహిళలందరికీ ఆర్టీసీ(RTC)లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి(Minister Dola Veeranjaneya Swamy) తెలిపారు. ఉచిత ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి చెప్పారు. ఒంగోలు బస్టాండ్‌లో ఐదు నూతన బస్ సర్వీసులను మంత్రి డోలా ప్రారంభించారు.
ఇప్పటికే ఘోర పరాజయంతో సతమతం అవుతున్న జగన్‌కు(YS Jagan).. సొంత పార్టీ నేతల అసమ్మతి మరో తలనొప్పిగా మారింది. తాజాగా వైసీపీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivas Reddy). ‘నాయకులకు మా జిల్లా ఏమైనా గొడ్డు పోయిందా?..
పొదిలి(Podili) ప్రాంతీయ వైద్యశాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి(Social Welfare Minister) డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి(Dola Sree Bala Veeranjaneya Swamy) ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, వైద్య సిబ్బంది తీరుపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసి నెల రోజులు గడిచినా ఆస్పత్రి ఆవరణలోని శిలాఫలకంపై ప్రభుత్వ రాజముద్ర ఏర్పాటు చేయకపోవడం, గత ముఖ్యమంత్రి జగన్, అప్పటి ఎమ్మెల్యే ఫొటోలు ప్రచురించడంపై మంత్రి డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు.
దొంగల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా దొరికిన సొత్తును అప్పగించడంలో చేతివాటం ప్రదర్శించిన ప్రకాశం జిల్లా చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది.