Home » President of india draupadi murmu
దేశాభివృద్ధి ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆకాంక్షించారు.. 18వ లోక్సభ తొలి సమావేశాల నాలుగోరోజు ఆమో పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి మాట్లాడారు. గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు.. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆమె తన ప్రసంగంలో వివరించారు.
దేశంలో పేపర్ లీకేజీ ఘటనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. 18వ లోక్సభ తొలి సమావేశాల్లో ఆమె ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
దేశం పురోగతి వైపు వెళ్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 18వ లోక్సభ తొలి సమావేశాల్లో ఆమె మొదటిసారి ప్రసంగించారు. లోక్సభ సమావేశాల్లో భాగంగా మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం చేయగా.. మూడోరోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. నాలుగో రోజైన ఇవాళ రాష్ట్రపతి ప్రసంగించారు.
పశ్చిమ బెంగాల్లో సోమవారం ఉదయాన్నే ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీ కొన్న ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరింది. దాదాపు 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని సామరస్యం, ఐక్యతను పెంపొందిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈద్ ఉల్ అదా సందర్భంగా ముర్ము, ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురు తమ ఎక్స్ అకౌంట్లో బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు.
వాణిజ్యపర అవసరాల కోసం ఉద్దేశించిన బొగ్గు గనుల వేలం వచ్చే వారం జరుగుతుందని బొగ్గు గనుల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ఆధ్వర్యంలో పదో రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలాన్ని నిర్వహిస్తారని పేర్కొంది.
ఢిల్లీలోని ఎర్రకోటపై 24 ఏళ్ల కిందట ఉగ్రదాడులు జరిగిన విషయం విదితమే. అయితే ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయిన పాకిస్థాన్ ఉగ్రవాది(Pakistan Terrorist) మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్(Mercy Petition) దాఖలు చేశాడు.
రాష్ట్రపతి భవన్ ఆవరణలో ఆదివారం సాయంత్రం వేలాదిమంది ఆహుతులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు, పొరుగు దేశాల అధినేతల సమక్షంలో 73 ఏళ్ల నరేంద్రమోదీ భారతదేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణం చేశారు. తద్వారా దేశ చరిత్రలో ఇప్పటి వరకూ మాజీ ప్రధాని జవహర్లాల్నెహ్రూకు మాత్రమే సాధ్యమైన రికార్డును సమం చేశారు.
Narendra Modi Swearing as PM: నరేంద్ర మోదీ నేతృత్వంలోని ‘మోదీ 3.0’ సర్కార్ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి డేట్, టైమ్ ఫిక్స్ చేశారు. జూన్ 9వ తేదీన సాయంత్రం 7.15 గంటలకు మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మరికొందరు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాల్లో బిజీగా ఉంది. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఎన్డీఏ పక్షాల నేత సమావేశం జరుగుతోంది. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను అమిత్ షా, నితిన్ గడ్కరీ బలపరిచారు.