Share News

President Murmu: ఆగస్టు 5 నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన

ABN , Publish Date - Jul 30 , 2024 | 08:51 AM

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వచ్చే నెలలో విదేశీ పర్యటన చేయనున్నారు. ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆరో రోజుల పాటు ఫిజీ, న్యూజిలాండ్, తూర్పు తైముర్ దేశాల్లో ఆమె పర్యటించనున్నారు. తొలుత ఆగస్ట్ 5వ తేదీన ఫిజీకి ఆమె చేరుకుంటారు.

President Murmu: ఆగస్టు 5 నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన
President Droupadi Murmu

న్యూఢిల్లీ, జులై 30: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వచ్చే నెలలో విదేశీ పర్యటన చేయనున్నారు. ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆరో రోజుల పాటు ఫిజీ, న్యూజిలాండ్, తూర్పు తిమూర్ దేశాల్లో ఆమె పర్యటించనున్నారు. తొలుత ఆగస్ట్ 5వ తేదీన ఫిజీకి ఆమె చేరుకుంటారు. ఈ పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు విలియమ్ కటోనివెరే‌తోపాటు ఆ దేశ ప్రధాన మంత్రి సితివేణి రబుకా‌తో జరిపే దైపాక్షిక చర్చల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు. ఫిజీ పార్లమెంట్‌లో ఆ దేశ సభ్యులనుద్దేశించి ఆమె ప్రసంగించనున్నారు. ఆ దేశంలో స్థిరపడిన భారతీయ సంతతితో రాష్ట్రపతి ముర్ము సమావేశం కానున్నారు. ఫిజీని సందర్శిస్తున్న తొలి భారత రాష్ట్రపతి ముర్మునే కానున్నారు.


అనంతరం న్యూజిలాండ్..

అనంతరం ఆగస్ట్ 7న రాష్ట్రపతి ముర్ము న్యూజిలాండ్‌ చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ గవర్నర్ జనరల్ సిండి కైరో, ప్రధాని క్రిస్టఫర్ లక్సన్‌తో రాష్ట్రపతి ముర్ము ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇక న్యూజిలాండ్‌లో ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యా సదస్సులో సైతం ఆమె పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత.. ఆ దేశంలో స్థిరపడిన భారతీయులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భేటీ కానున్నారు.

Also Read: Jharkhand: పట్టాలు తప్పిన ముంబయి- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు


చివరగా తూర్పు తిమూరు..

ఆగస్టు 10న తూర్పు తిమూరుకు రాష్ట్రపతి ముర్ము చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు జోస్ రామోస్ హోర్తా, ప్రధాని క్సానానా గుస్మావోతో ఆమె సమావేశమవుతారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 30 , 2024 | 08:51 AM