Home » Pressmeet
కరీంనగర్: పదేళ్ల విభజన హామీల అమలు నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం దీక్ష చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పొన్నం దీక్ష చేయనున్నారు.
విజయవాడ: మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. దీనిలో భాగంగా విజయవాడ రూరల్ మండలం, కొత్తూరు, తాడేపల్లి గ్రామంలో గత రాత్రి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాను మద్దతు ఇవ్వడం కొందరికి నచ్చడం లేదని, సీఎం పనిచేస్తున్నారు కాబట్టే సపోర్ట్ చేస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ..
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో సంక్షేమంపై చర్చకు తాము రెడీ అని.. సీఎం జగన్ సిద్ధమా? ! అని సవాల్ చేశారు.
జగిత్యాల: మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఉదయం కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్రమోదీ ఫోటో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళే దమ్ముందా బండి సంజయ్? అంటూ ప్రశ్నించారు.
సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు. రైతుల వద్దకు కేసీఆర్ పోయి పరామర్శిస్తే తట్టుకోలేక.. రేవంత్ రెడ్డి నోటి కొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి భాష జుగుప్సా కరంగా ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం సరికాదన్నారు.
హైదరాబాద్: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్బీ టాక్స్ నడుస్తోందని ఆరోపించారు. ఆర్.. అంటే రాహుల్, రేవంత్ రెడ్డి టాక్స్..బీ.. అంటే భట్టి విక్రమార్క టాక్స్ అంటూ ఆయన కామెంట్స్ చేశారు.
విజయవాడ: పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్న జగన్ ప్రభుత్వం అసలు ఏమి చేసింది?. ప్రజల సంక్షేమం గురించి ఏమి చేసింది?.. పేపర్ల ప్రకటనల కొరకు ఖర్చు చేయటం తప్ప ఇంకేమి చేయలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
అమరావతి: మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకునేవారు రాష్ట్రాన్ని బాగుచేసే వారికి ఓటు వేయాలని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడాలంటే మీ ఓటు హక్కుతోనే సాధ్యమని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు.
విజయవాడ: సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ భేటీలో పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.