Home » Pressmeet
వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని కురసాల కన్నబాబు స్పస్టం చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు మడత పెట్టి బీరువాలో పెట్టేశారని విమర్శించారు. రాష్ట్రంలో రెండే రెండు పథకాలు అమలు అవుతున్నాయని, అవి చంద్రన్న పగ, దగా పథకాలు మాత్రమేనని విమర్శించారు.
గుంటూరు మిర్చి యాడ్కు వెళ్లిన జగన్కు భద్రత ఇవ్వకుండా హాని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. దీనిపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి న్యాయపోరాటం చేస్తామన్నారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలన్నారు.
ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్ధత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని మాజీ ఎంపీ కేశినేని అన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.
ఇప్పుడు తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు మోదీని ఆశీర్వదించే విధంగా కనిపిస్తోందని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఉపాధ్యాయులకు అండగా కొట్లాడిన పార్టీ బీజేపీ అని, టీచర్ల విషయంలో, మధ్యతరగతి వారి విషయంలో బీజేపీ కృషిచేసిందని ఆయన పేర్కొన్నారు.
ప్రయోగ్రాజ్ కుంభమేళాలో జరుగుతున్న తీరును మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రపంచ చరిత్రగా అభివర్ణించారు. 45 కోట్ల మంది కుంభమేళలో పవిత్ర స్నానం చేయడం ఒక్క భారతదేశంలోనే జరుగుతుందన్నారు. మారుతున్న తరానికి అనుగుణంగా యువతలో మార్పురావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.
వల్లభనేని వంశీ అరెస్టును మాజీ మంత్రి బొత్స సత్యానారయణ ఖండించారు. కేసు వెనక్కు తీసుకుంటే మళ్ళీ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను శాసనమండలిలో ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు.
స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్లముందుకు తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని.. ఏకంగా ఆ ఇంటికి ఉన్న గేటును బ్యాంక్ సిబ్బంది ఎత్తుకెళ్లారని.. మరి రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని.. మాటతప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యముందా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని,, యాత్రల పేరుతో డిప్యూటీ సీఎం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని శైలజానాథ్ అన్నారు. సూపర్ సిక్స్ హామీలను చూసి ప్రజలు ఎన్డీయేకు అధికారం ఇచ్చారని, హామీలు ఇచ్చేటప్పుడు సీఎం చంద్రబాబుకు తెలియదా.. అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియరెన్సులో వేగం పెరగాలని, ఫైళ్లు ఎక్కడికక్కడ క్లియర్ కాకుండా ఆగిపోతున్నాయనేదానిపైన కార్యదర్శులు, శాఖల విభాగాధిపతులు సమీక్ష చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆలస్యానికి గల కారణాలు తెలుసుకుని వాటిని తొలగించి ఫైళ్లు త్వరితగతిన పరిష్కారం చేయాలన్నారు.
కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కులగణనపై ఆ పార్టీలు చేస్తున్న కామెంట్స్ సరికాదన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగడం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. మైనార్టీలను ఇప్పుడు కొత్తగా బీసీల్లో చేర్చలేదని.. మైనార్టీలు ఎప్పటి నుంచో బీసీల్లో ఉన్నారని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.