Share News

Shailajanath.. వారిని ఎదురించడానికే వైసీపీలో చేరాను: శైలజానాథ్

ABN , Publish Date - Feb 12 , 2025 | 01:33 PM

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని,, యాత్రల పేరుతో డిప్యూటీ సీఎం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని శైలజానాథ్ అన్నారు. సూపర్ సిక్స్ హామీలను చూసి ప్రజలు ఎన్డీయేకు అధికారం ఇచ్చారని, హామీలు ఇచ్చేటప్పుడు సీఎం చంద్రబాబుకు తెలియదా.. అని ఆయన ప్రశ్నించారు.

Shailajanath.. వారిని ఎదురించడానికే  వైసీపీలో చేరాను: శైలజానాథ్
Shailajanath Press Meet

అనంతపురం: సాదరంగా, ప్రేమ పూర్వకంగా వైఎస్సార్‌సీపీ (YSRCP) జిల్లా పార్టీ కార్యాలయంలోకి తనను ఆహ్వానించిన అందరికి ధన్యవాదాలు అంటూ మాజీ మంత్రి శైలజానాథ్ (Ex Minister Shailajanath ) తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన అనంతపురం (Anantapuram)లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం (NDA Govt.) వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఎదురించడానికే వైఎస్సార్‌సీపీలో చేరినట్లు చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి, ఆ కుటుంబం అంటే తనకు ఆరాధన భావం ఉందని.. అన్న, చెల్లెల్ల మధ్య జరుగుతున్న వివాదం ముగిసిపోవాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.

ఈ వార్త కూడా చదవండి..

భర్త మృతి.. పోరాడి గెలిచిన మహిళా..


రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని,, యాత్రల పేరుతో డిప్యూటీ సీఎం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని శైలజానాథ్ అన్నారు. సూపర్ సిక్స్ హామీలను చూసి ప్రజలు ఎన్డీయేకు అధికారం ఇచ్చారని, హామీలు ఇచ్చేటప్పుడు సీఎం చంద్రబాబుకు తెలియదా.. అని ప్రశ్నించారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం ఇవ్వడానికి చంద్రబాబు మనసుకు కష్టంగా ఉంటుందని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, క్షమాపణలు చెబితే సరిపోదని అన్నారు. ఏపీలో శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.


కాగా ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ఈ నెల 7వ తేదీ (శుక్రవారం) వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు తాడేపల్లిప్యాలెస్‌లో శైలజానాథ్‌కు కండువా కప్పి, ఆలింగనం చేసుకొని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తదితరులు ఉన్నారు. ఎన్నికలకు ముందే శైలజానాథ్‌ పార్టీ మారతారంటూ ప్రచారం జరిగింది. ఆ సమయంలో ప్రాంతీయ పార్టీల్లో చేరినా టికెట్‌ దక్కే పరిస్థితి లేకపోవడంతో మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు వైసీపీలో చేరారు. జగన్ నాయకత్వంలో పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని శైలజానాథ్ చెప్పారు. హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రజల తరపున వైసీపీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.


దివంతగత రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించిన కారణంగానే శైలజానాథ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలిసారిగా 2004లో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఆయన మొదటి సారి పోటీ చేసి గెలిచారు. 2009లో మళ్లీ గెలుపొందారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. విభజన తర్వాత నుంచి కూడా శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీతోనే అంటకాగుతున్నారు. ఆ క్రమంలో జగన్ ఆహ్వానం మేరకు శైలజానాథ్ వైసీపీలో చేరారు.

ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారి పీసీసీ చీఫ్‌గా (P.C.C chief) రఘువీరా రెడ్డి (Raghu Veera Reddy) బాధ్యతలు స్వీకరించగా, ఆయన తర్వాత సాకే ఆ స్థానాన్ని చేపట్టారు. అయితే, అప్పట్లో జగన్‌కు వ్యతిరేకంగా ఎక్కువగా మాట్లాడడం లేదని కొందరు పెద్దలు అధిష్టానానికి ఫిర్యాదు చేయడం, సాకే కు రాజకీయం పై పెద్దగా ఆశక్తి ఉండకపోవడంతో ఆయన పార్టీ పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన రాజకీయాల్లోకి యాక్టీవ్ అవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్

రామ్ చరణ్, ఉపాసన ఫుల్ హ్యాపీ..

. ప్యాసింజర్లకు ప్రైవేట్ ట్రావెల్స్ షాక్

హైదరాబాద్ శివారులో క్యాసినో గుట్ఠు రట్టు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 12 , 2025 | 01:33 PM