Home » Pressmeet
అడవుల్లో ఆదివాసీలకే ఆస్తి హక్కు ఉండాలన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఐదో షెడ్యూల్లో చేర్చి తెచ్చిన 1/70 చట్టానికి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ.. యాక్ట్ 1/70 మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని, గిరిజనులు ఆందోళన చెందవద్దని మంత్రి అన్నారు.
ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రేస్ నేతలు ఇస్తామన్న ఆరు గ్యాంరెంటీ పథకాలు అటకెక్కాయని, బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరు మార్చకుంటే కేంద్రం నిధులు ఇవ్వదని అన్నారు. ప్రధాన ఆవాజ్ యోజన పథకంలో ఆయన ఫోటో లేకుంటే నిధులు ఎందుకిస్తారని ఆమె ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రుణమాఫీని ఆగంచేసి.. పెట్టుబడి సాయానికి పాతరేసి.. ముంచేరోజులు తేవడంవల్లే రాష్ట్రంలో ఈ అనర్థాలని ఆయన అన్నారు.
మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరడంపై డొక్కా మాణిక్య వర ప్రసాద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మిత్రుడిగా శైలజానాధ్‌కు సలహా ఇస్తున్నానన్నారు. వైఎస్సార్సీపీలో విలువలు ఉండవని, అది దుర్మార్గమైన పార్టీ అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
అమరావతి: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్‌కు తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 11 సీట్లు కూడా రావని అన్నారు.
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోందని.. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారంటీ’ అని ప్రచారం చేశారని.. 9 నెలల తర్వాత బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీగా మారిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. బటన్ నొక్కడం పెద్ద పనా అని ఆరోజు మాట్లాడారని, ముసలోళ్లు కూడా బటన్ నొక్కుతారంటూ తమపై విమర్శలు చేశారన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3324 కోట్లు తగ్గిన మాట వాస్తవమా కాదా.. అని ప్రశ్నించారు.
రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం, అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఇద్దరూ తన కాలి గోటికి సరిపోరని అన్నారు. టీఆర్ పనికిరాని వ్యక్తి అని, పనికి రాని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్‌లా తాను ఎలక్షన్, కలెక్షన్ చేయలేదని మంత్రి అన్నారు.
చాలా తక్కువ వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు మారనున్నాయని, భారీ పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఆరు నెలలలోపే ఈ అభివృద్ధి ఫలితాలు ప్రజలకు కనిపిస్తాయన్నారు. వైఎస్సార్సీపీ పాలనతో పారిశ్రామిక, వ్యాపార వేత్తలు భయపడి పారి పోయారని.. అలాంటి వారంతా ఇప్పుడు ఏపీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.