YS Jagan.. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తా: జగన్
ABN , Publish Date - Feb 06 , 2025 | 12:05 PM
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోందని.. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారంటీ’ అని ప్రచారం చేశారని.. 9 నెలల తర్వాత బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీగా మారిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. బటన్ నొక్కడం పెద్ద పనా అని ఆరోజు మాట్లాడారని, ముసలోళ్లు కూడా బటన్ నొక్కుతారంటూ తమపై విమర్శలు చేశారన్నారు.

అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు (YSRCP Chief), మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Ex CM Jagan) కూటమి ప్రభుత్వం (Kurtami Govt.)పై తీవ్రస్థాయిలో విమర్శలు (Comments) గుప్పించారు. గురువారం ఆయన మీడియా సమావేశం (Press Media)లో మాట్లాడుతూ.. అప్పుల్లో కూటమి ప్రభుత్వం రికార్డ్ బద్దలు కొట్టిందని, 9 నెలల్లోనే రూ.80 వేల కోట్లు అప్పు తెచ్చిందని.. అమరావతి నిర్మాణం పేరుతో మరో రూ.52 వేల కోట్ల అప్పులు చేయడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తానని స్పష్టం చేశారు.
ఈ వార్త కూడా చదవండి..
ఆ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుందని.. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారంటీ’ అని ప్రచారం చేశారని.. 9 నెలల తర్వాత బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీగా మారిందని జగన్ విమర్శించారు. బటన్ నొక్కడం పెద్ద పనా అని ఆరోజు మాట్లాడారని, ముసలోళ్లు కూడా బటన్ నొక్కుతారంటూ తమపై విమర్శలు చేశారన్నారు. సూపర్ సిక్స్ అంటూ ఇంటింటా ప్రచారం చేశారని, ‘నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు’ అంటూ ప్రచారం చేశారని, హామీలపై ఇంటింటికీ బాండ్లు కూడా ఇచ్చారన్నారు. అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయమన్నారని.. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు, బాండ్లు ఏమయ్యాయని జగన్ నిలదీశారు.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా కుదించేస్తున్నారని ప్రస్తుతం చేసిన, చోయబోతున్న అప్పులు రూ.1.45 లక్షల కోట్లకుపైనే ఉన్నాయని జగన్ అన్నారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్ సిక్స్ ఇచ్చారా?.. అని ప్రశ్నించారు. పథకాలు ఏవీ అమలు కావడం లేదని, మరి రూ.1.45 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని అన్నారు. కొత్త ఉద్యోగాలు ఇచ్చింది లేదు కానీ ఉన్న ఉద్యోగాలు తీసేశారని విమర్శించారు. 2 లక్షల 60 వేల మంది వలంటీర్ల ఉద్యోగాలు తీసేశారని, మద్యం షాపుల్లో పనిచేసే 18 వేల మంది ఉద్యోగాలు పోయాయని జగన్ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నిధుల్లో రూ.3324 కోట్లు తగ్గిన మాట వాస్తవమా కాదా: రామకృష్ణ
ఎస్సీ బాలుర హాస్టల్లో రాత్రి జిల్లా కలెక్టర్ బస
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News