Home » Raghurama krishnam raju
రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసి బాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్ట్‌లో వాదనలు ముగిసాయి. ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
Raghurama: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆకివీడులో నిన్న జరిగిన ఘటనపై సునీల్ బాధ్యత వహించాలన్నారు. సునీల్ అనుచరుడిని వెంటనే చర్యలు తీసుకోవాలని రఘురామ అన్నారు.
అసెంబ్లీ 60 పని దినాలలో ఎలాంటి సమాచారమూ లేకుండా గైర్హాజరైతే అతడి శాసన సభ్యత్వం ఆటోమేటిగ్గా రద్దవుతుందని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.
Supreme Court: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభావతి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు వేగవంతం అయ్యింది. ఈ కేసులో నిందితుడిని ఉన్న కామేపల్లి తులసిబాబును ఒంగోలు పోలీసులు ఇవాళ (మంగళవారం) రెండో రోజు విచారణ చేయనున్నారు.
రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు తులసిబాబును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం రాత్రి విచారించారు. ప్రధానంగా మాజీ సీఐడి చీఫ్ సునీల్ కుమార్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. అయితే సమయం ఎక్కవగా లేకపోవడంతో గంటన్నర మాత్రమే విచారించారు. తిరిగి మంగళవారం ఉదయం విచారణ కొనసాగనుంది.
నాటి ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు కామేపల్లి తులసి బాబును గుంటూరు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం నుంచి ఎస్పీ దామోదర్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో తులసి బాబును విచారించనున్నారు.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి కామేపల్లి తులసిబాబును గుర్తించేందుకు ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా జైల్లో న్యాయమూర్తి సమక్షంలో పోలీసులు పరేడ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రఘురామ గుంటూరు జైలుకు వస్తున్నారు.
YS Jagan Case: జగన్ బెయిల్ రద్దు, కేసుల బదిలీకి సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో సోమవారం విచారణకు వచ్చింది. సీబీఐ తరపు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేనందున విచారణను వాయిదాకు సీబీఐ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Andhrapradesh: రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో రఘురామ ఇంప్లీడ్ పిటిషన్ వేయగా.. అందుకు న్యాయస్థానం అనుమతించింది.