Home » Rajasthan
Rajasthan: భార్యభర్తల మధ్య గొడవలు జరిగి.. భార్య(Wife) తన పుట్టింటికి వెళ్లడం.. ఆ తరువాత భర్త(Husband) బ్రతిమాలి మళ్లీ తన ఇంటికి తీసుకెళ్లడం పలు సందర్భాల్లో జరుగుతుంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో పుట్టింటి నుంచి మెట్టినింటికి రావడానికి ఆ భార్య తన భర్తకు(Wife and Husband) కొన్ని కండీషన్స్ పెడుతుంటుంది.
హాస్టల్ విద్యార్థి ఎంతకీ గది తలుపులు తెరవకపోవడంతో అందరిలో టెన్షన్! అతడు గాఢ నిద్రలో ఉన్నాడని తెలిసీ వెల్లివిరిసిన నవ్వులు
శివరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మహా శివరాత్రి సందర్భంగా రాజస్థాన్‌లోని కోటలో శుక్రవారం ఉదయం జరిగిన ఊరేగింపులో విద్యుదాఘాతంతో సుమారు 14 మంది చిన్నారులు గాయపడ్డారు.
కోవిడ్ భయాలు తగ్గుముఖం పట్టినప్పటికీ అడపాదడపా కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తాజాగా కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఘాటుగా విమర్శలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనలో దేశం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు.ఆ పార్టీకి ఎప్పుడూ దేశ భవిష్యత్తుపై ఆలోచనలేదని విమర్శించారు. ఇప్పుడు దేశం ఎంతో ధీమాగా ముందుకు దూసుకు వెళ్తోందని చెప్పారు. శుక్రవారం జరిగిన 'వికసిత్ రాజస్థాన్' కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ పాల్గొన్నారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు బుధవారంనాడు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజ్యసభకు నామినేషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాజకీయ నేతలు, ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు తమ ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి కాబట్టి, తాము అనారోగ్యం బారిన పడకుండా ఉండేలా తగిన పద్ధతులు పాటిస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఓ మాజీ ముఖ్యమంత్రి అస్వస్థతకు గురయ్యారు.
రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఓ పెళ్లిలో ఉత్సాహాంగా స్టెప్పులేశారు. ఇన్ స్టాగ్రామ్‌లో ఆ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
ఎక్కువ మంది పిల్లల్ని కనాలని రాజస్థాన్ మంత్రి బాబులాల్ ఖరాడీ అన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారందరికీ ఇళ్లు నిర్మి్స్తారని భరోసా ఇచ్చారు. రాజస్థాన్ గిరిజనాభివృద్ధి మంత్రిగా ఉన్న బాబులాల్ ఉదయ్‌పూర్‌లోని నాయి గ్రామంలో బీజేపీ నిర్వహించిన 'వికసిత్ భారత్ సంకల్ప యాత్ర' కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.