Home » Road Accident
Andhrapradesh: నగరంలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధి గౌరెల్లి పాపయ్ గూడా చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకులను టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కుత్బుల్లాపూర్‌కు చెందిన తండ్రి కుమార్, కొడుడు ప్రదీప్ (7వ తరగతి)గా గుర్తించారు.
National: అస్సాం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్‌లోని డెర్గావ్ సమీపంలోని బలిజం ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Road Accident Case: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. షకీల్ కొడుకును పోలీస్ స్టేషన్ నుంచి తప్పించినందుకు మాజీ సీఐ దుర్గారావుపై కేసు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. అటు కుమారుడిని రహస్యంగా విదేశాలకు పంపిన మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై కూడా కేసు నమోదు చేయనున్నారు.
Andhrapradesh: జిల్లాలోని దేవరపల్లి మండలం దుద్దుకూరు జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టీగా కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
కోనసీమ జిల్లా: అమెరికా నుంచి అమలాపురానికి రోడ్డు ప్రమాద మృతదేహాలు మంగళవారం చేరుకున్నాయి. టెక్సాస్‌లో ఇటీవల ట్రక్కు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. వారంతా ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు. ఎమ్మెల్యే చిన్నాన్న, చిన్నమ్మ, వాళ్ళ కుమార్తె, మనవడు, మనవరాలు...
మహబూబాబాద్: పట్టణ శివారు ఏటిగడ్డతండా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా..
Telangana: జిల్లాలోని పటాన్చెరు పట్టణ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ముగ్గురు యువకులు స్కూటీపై వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: పరకాల - భూపాలపల్లి ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రేగొండ మండలం, కొత్తపల్లి వద్ద ఆర్టీసీ బస్సు- డీసీఎం వ్యాను ఢీ కొన్నాయి. ఈ ఘటనలో వ్యాను డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్ మండలం, నర్సింగ్ రావ్ పల్లి శివారులో 161 జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బోలోరో వాహనం మోటార్ సైకిల్‌ను ఢీ కొంది.
మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ట్రక్కును ప్రైవేట్ బస్సు ఢీ కొన్న ఘటనలో మంటలు చేలరేగి 13 మంది సజీవ దహనం అయ్యారు. మరో 17 మంది గాయపడ్డారు.