SAAP Chairman Ravi Naidu: కంగారు పడకు రోజా.. త్వరలోనే అరెస్టు అవుతావ్: శాప్ ఛైర్మన్ రవి నాయుడు..
ABN , Publish Date - Apr 05 , 2025 | 07:24 PM
మాజీ మంత్రి రోజా నోటి దూల వల్లే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని శాప్ ఛైర్మన్ రవి నాయుడు ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నట్లు చెప్పుకొచ్చారు.

తిరుపతి: వైసీపీ హయాంలో నిరుపేద క్రీడాకారులకు చెందిన రూ.119 కోట్లను కాజేసిన మాజీ మంత్రి రోజా అవినీతి త్వరలోనే బట్టబయలు అవుతుందని శాప్ ఛైర్మన్ రవి నాయుడు తెలిపారు. కోట్లకు కోట్లు నొక్కేసి బంగారు నగలు, నెక్లెస్‌లు కొన్న రోజా బండారంపై మరికొన్ని రోజుల్లో బయటపడుతుందని చెప్పారు. ఆమె అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని, త్వరలోనే నిజాలు నిగ్గుతేలుతాయని అన్నారు. రోజాను అరెస్టు చేయడం ఖాయమని, అరెస్టు చేయమని ఆమె పదే పదే కోరనక్కరలేదని ఎద్దేవా చేశారు.
రోజా నోటి దూల వల్లే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని రవి నాయుడు ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ, ఏపీ అభివృద్ధిపై రోజా విమర్శలు చేస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. చెన్నైలో తిరిగే రోజాకు ఏపీలో జరిగే అభివృద్ధి, సంక్షేమం గురించి ఏం తెలుస్తుందంటూ ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వీకెండ్ పొలిటీషియన్ అని రవి నాయుడు అన్నారు.
కర్ణాటకలో బిజినెస్ నడుపుకుంటూ పార్టీని, కార్యకర్తలను గాలికి వదిలేసిన జగన్ ఇకపై అక్కడే స్థిరపడాలని హితవు పలికారు రవి నాయుడు. విద్యుత్ ఛార్జీలు పెంచింది కూటమి ప్రభుత్వమని అదే పనిగా వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు ఛార్జీలు పెంచింది గత జగన్ సర్కారేనని అన్నారు. ఆ భారమే ఇప్పుడు ప్రజలపై పడుతోందని శాప్ ఛైర్మన్ ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచకపోయినా తిరుపతిలో వైసీపీ నేతలు పగటివేషాలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పార్కుల్లో వేషాలు వేయటం కాదని, టీడీఆర్ బాండ్ల బాధితుల ముందుకు భూమన అభినయరెడ్డి వస్తే ప్రజలే బుద్ధి చెప్తారని రవి నాయుడు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
BJP MP Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం.. ఆ మూడు పార్టీలు ఒక్కటే: ఎంపీ లక్ష్మణ్..
Bus Conductor Problems: అత్యంత ఎత్తైన బస్ కండక్టర్ ఇతనే.. అతని ఇబ్బందులు చూస్తే బాబోయ్..
Weather Report: దంచికొట్టుడే.. ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఎప్పట్నుంచి అంటే..