Home » Samajwadi Party
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల లెక్క తేలిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొననున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగుతోందని సమాజ్ వాదీ పార్టీ మరోసారి స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీతో సీట్లపై చర్చలు జరుగుతున్నాయని వివరించింది.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ కి ఆ పార్టీ ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన మంగళవారంనాడు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించారు.
ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. సోమవారం రాత్రి జరిగిన చర్చలు అర్థాంతరంగానే ముగిసాయి. మొరాదాబాద్ డివిజన్లో కీలకమైన మూడు సీట్ల విషయంలో రెండు పార్టీలు పట్టువిడుపులు లేని ధోరణిలో వ్యవహరించడంతో పొత్తుకు అవకాశాలు దాదాపు లేనట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ కు అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ తుది ఆఫర్ ఇచ్చింది. 'ఇండియా' కూటమి భాగస్వామ్య పార్టీగా సీట్ల షేరింగ్‌లో ఫైనల్‌గా కాంగ్రెస్‌కు 17 సీట్లు ఇస్తామని చెప్పింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఈరోజు యూపీలోని ప్రతాప్‌గఢ్ మీదుగా అమేథీకి చేరుకుంది. ఈ క్రమంలోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీకి షాకిచ్చారు.
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారంనాడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు కారణాలను వివరిస్తూ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు లేఖ రాశారు.
ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రముఖ నటి, రాజకీయవేత్త జయాబచ్చన్ ను సమాజ్‌వాదీ పార్టీ తిరిగి నామినేట్ చేసింది. అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ మంగళవారంనాడు రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
బీహార్ రాజకీయాల్లో తలెత్తిన హైడ్రామా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పడిన 'ఇండియా' కూటమికి గట్టిదెబ్బగా విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల ఒప్పందంపై అవగాహన కుదిరిన సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్‌లో పొత్తుల విషయంలో బహుజన్ సమాజ్ పార్టీని దూరంగా పెట్టాలని ఇండియా కూటమి నాలుగో సమావేశంలో కాంగ్రెస్‌ను అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ కోరినట్టు తెలుస్తోంది.