Home » Seethakka
Telangana Budget 2024-25: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత, విపక్ష నేత కేసీఆర్ చేసిన కామెంట్స్‌కు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యేలు..
రాష్ట్రంలోని ప్రతి తండాకు, గూడేనికి బీటీ రోడ్లు వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి గిరిజన ఆవాసానికి రవాణా, తాగునీటి సౌకర్యం, వారి పిల్లలు చదువుకునే అవకాశం కల్పించినప్పుడే.. తెలంగాణ ఏర్పాటు లక్ష్యం, ఉద్దేశం సంపూర్ణంగా నెరవేరినట్లు తాము భావిస్తామన్నారు.
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కకు తెలంగాణ అంగన్వాడీ ఎంప్లాయిస్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది.
రాష్ట్ర మహిళా కమిషన్ చైౖర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బుధవారం హైదరాబాద్ బుద్ధ భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందించనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. దీంతో టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష వరకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
పంచాయతీరాజ్ శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితి తలెత్తకూడదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పాలని అడిగారు.
పసిప్రాయం నుంచే అక్షరాభ్యాసం చేయించాలనే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లల భవిష్యత్‌కు పునాది వేస్తున్నామని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
అందీ అందని పౌష్టికాహారం.. చిన్నారులపై మొక్కుబడి పర్యవేక్షణ.. పారిశుధ్య లోపం..! ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రాల స్వరూపం ఇది. ఇకపై మాత్రం.. చదువు, ఆరోగ్యంతో పాటు పిల్లల మానసిక ఉల్లాసానికి ఆటలు.. బోధనలోనూ కొత్త పద్ధతులతో సరికొత్త రూపం సంతరించుకోనున్నాయి.
కడుపు నొప్పి వచ్చినా.. పురుటి నొప్పులు మొదలైనా.. అక్కడివారి బాధలు అరణ్య రోదనే..! విష సర్పం కాటువేసినా.. విష జర్వం బారినపడినా.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిందే..!
ఆపన్నులకు ఇవ్వాల్సిన ‘ఆసరా’.. అనర్హులకూ అందించేశారు. ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత కార్మికులు, వికలాంగులు, డయాలసిస్, పైలేరియా, ఎయిడ్స్ రోగులకు ఆసరా పథకం కింద గత ప్రభుత్వం పింఛన్లు అందజేసింది.