Education: అంతర్జాతీయ స్థాయిలో విద్యావ్యవస్థ: సీతక్క
ABN , Publish Date - Nov 04 , 2024 | 03:37 AM
తెలంగాణ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే విధంగా విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని తెలిపారు.
ములుగు, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే విధంగా విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని తెలిపారు. 16 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పాలనలో ఇది సాధ్యమైందన్నారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్‌తో కలిసి ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క ఆదివారం పర్యటించారు.
స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని సందర్శించిన మంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సమీకృత గురుకులాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచ్చి నాణ్యమైన విద్యాబోధన అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. పేద విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు అందిస్తుంటే బీఆర్‌ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, అర్థంలేని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వెయ్యి మెట్రిక్‌టన్నుల నిల్వ సామర్థ్యంలో ములుగులో నిర్మించిన గోదామును సీతక్క ప్రారంభించారు.