Home » Singanamala
మండలంలోని చిన్న జలాలపురం అంగన వాడీ కేంద్రం వద్ద పెరిగిన గడ్డిని, పిచ్చిమొక్కలను తొలగించాలని పిల్లలు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి చెందిన రెండు అంగనవాడీ కేంద్రాలను ఒక భవనంలో నిర్వహిస్తున్నారు. ఆ కేంద్రాలకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వయస్సు ఉన్న పిల్లలు 30 మంది వస్తారు.
వ్యాపార పరంగా దిన దినాభివృద్ధి చెందుతున్న మండలకేంద్ర మైన నార్పలలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తు న్నాయి. రోజూ రాత్రైతే చాలు ఎవరి ఇంట్లో దొంగలు చొర బడుతారో అనే భయం వారిలో నెలకొంది. కేవలం ఒకటి న్నర నెల వ్యవధిలోనే పెద్ద పెద్ద దొంగతనాలు జర గడం తో మండలకేంద్రం వాసులు నిద్రలేని రాత్రులు గడుపుతు న్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
మినీ లెదర్ పరిశ్రమను ప్రారంభించి దళిత కుటుంబాల్లోని యవతకు ఉపాధి కల్పిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. శుక్రవారం శింగనమల మండలంలోని రాచేపల్లి వద్ద మూతపడ్డ మినీ లెదర్ పరిశ్రమను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు.
నియోజకవర్గంలో సాగు, తాగునీటికి సమస్యల లేకుండా చూడాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కోరారు. దీనిపై కలెక్టర్ వినతి పత్రం అందజేశారు.
శింగనమలలోని శ్రీరంగరాయల చెరువు నిండి మరువ పారితే ఉధృతి తగ్గేవరకూ 40 నుంచి 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఈ సమస్య పరిష్కారానికి మరువ వద్ద బ్రిడ్జి నిర్మించాలన్న ప్రతిపాదన కొన్నేళ్ల నుంచి ఉంది. బ్రిడ్జి నిర్మిస్తామని వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త, అప్పటి ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి హామీ ఇచ్చారు. కానీ నిలబెట్టుకోలేదు. దీంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ...
మండలంలో డయేరియా విజృంభిస్తోంది. బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్నతికి పరుగులు పెడుతున్నారు. ప్రతి గ్రామంలో నుంచి శింగనమల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, తరిమెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డయేరియా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు.
మండలంలో ఉపాధి పనులు చేసిన చోట్ట నేమ్ బోర్డులు ఎందుకు పెట్టలేదని వాటర్‌షెడ్ ఏపీడీ సుధాకర్‌రెడ్డి.. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శింగనమల మండలంలో 2023-24 సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో రూ.8 కోట్ల పనులపై సామాజిక తనిఖీల తరువాత గురువారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రజావేదిక ఓపెన ఫోరం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందేలా చూడాలని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి సూచించారు. బుక్కరాయసముద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు. భోజనం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. పాఠశాలలో ఆగిపోయిన మధ్యాహ్న ...
‘రేయ్ సాంబా.. కారు దిగురా..! ఏ ముఖం పెట్టుకుని మా అన్న ఇంటికి వస్తున్నావ్..? నీ అంతు చూస్తాం..’ అంటూ.. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. దాడికి యత్నించారు. సాంబ కారు అద్దాలు ధ్వంసం చేశారు..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సమైక్యంధ్ర ఉద్యమం కాలం నుంచి ప్రత్యేక గుర్తింపు పొందిన నేత మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్(Congress) ఉనికే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో శైలజానాథ్(Sake Sailajanath) అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.