Home » Singapore
1975 నవంబర్ 11న సింగపూర్లోని తెలుగు వారి శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన సింగపూర్ తెలుగు సమాజం అనేక రకాల సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తూ నవంబర్ 11న 49వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది.
కాలేజీ విద్యార్థిని (College Student) పై అత్యాచారానికి పాల్పడిన భారతీయుడి (Indian) కి సింగపూర్ న్యాయస్థానం 16 ఏళ్లు జైలు, 12 బెత్తం దెబ్బల శిక్ష విధించింది. ఈ ఘటన నాలుగేళ్ల క్రితం జరిగింది.
సింగపూర్లో లూమియర్ అంతర్జాతీయ సంస్థ అక్టోబర్ 21 తేదీన నిర్వహించిన అందాల పోటీలలో సింగపూర్ తెలుగు సమాజం పూర్వ కమిటీ, జీవితకాల సభ్యురాలు చిలకల విజయ దుర్గ 'మిసెస్ ఆసియా ప్రపంచ సుందరి-2023' విజేతగా నిలిచారు.
ఎప్పుడూ వినూత్న కార్యక్రమాలతో అలరించే సింగపూర్ తెలుగు సమాజం (STS) వారు ఈ సంవత్సరం దసరా సందర్భంగా అత్యంత వేడుకగా దసరా కల్చరల్ నైట్ -2023 కార్యక్రమంతో ముందుకు వచ్చారు.
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్లో సింగపూర్ బతుకమ్మ వేడుకలు అత్యంత కన్నుల పండువగా జరిగాయి.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! సింగపూర్ గౌరమ్మ ఉయ్యాలో!! అంటూ ఆడబిడ్డలు అందరూ ఈ సంవత్సరం కూడా సింగపూర్లో బతుకమ్మ పండగను పెద్ద ఎత్తున జరుపుకోవటానికి ప్రతి ఇంటి నుండి కదలి రానున్నారు.
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా వినాకయ చవితి పూజా కార్యక్రమం స్థానిక పీజీపీ హాల్లో ఘనంగా జరిగింది.
తోటి కార్మికుడిపై దాడికి పాల్పడిన ఘటనలో భారత వ్యక్తి (Indian Man) కి సింగపూర్ కోర్టు శుక్రవారం పది నెలల జైలు శిక్ష విధించింది. దాడిలో గాయపడిన బాధితుడు కూడా భారతీయుడే కావడం గమనార్హం. పీకలదాక తాగి ఇద్దరు బాహాబాహీకి దిగారు.
భారత సంతతికి చెందిన ఆర్థికవేత్త ధర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ నగర-రాష్ట్ర తొమ్మిదో అధ్యక్షుడిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. 66 ఏళ్ల ధర్మన్ ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
భారత దేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (DPIs) పరిణామాత్మక ప్రభావాన్ని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత దశాబ్దంలో ఈ రంగంలో వచ్చిన మార్పులపై రూపొందించిన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.