Home » Singapore
కరోనాతో కళ్లెదుటే తన తండ్రి, ఇంకా ఎంతో మంది చనిపోవడం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా గిర్మాజీపేటకు చెందిన రంజిత్ని కదిలించింది. కాలుష్యం మానవ రోగ నిరోధక శక్తిని బలహీనపరిచి, ప్రజల్ని సులువుగా కరోనా, ఇతర అనారోగాల బారిన పడేటట్లు చేస్తుందని తెలుసుకున్నాడు.
ఓ వ్యక్తి హత్య కేసులో భారత సంతతి వ్యక్తి (Indian origin man) ని సింగపూర్ పోలీసులు (Singapore Police) అదుపులోకి తీసుకున్నారు.
సింగపూర్ అధ్యక్ష ఎన్నికల రేసులో భారత సంతతి (Indian origin) కి చెందిన థర్మన్ షణ్ముగరత్నం (Tharman Shanmugaratnam) ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని సింగపూర్ అధ్యక్ష ఎన్నిక కమిటీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్లో శ్రీయాగం జరగనుంది.
పూటుగా తాగి ఓ ఇంట్లోకి దూరడమే కాకుండా ఆ ఇంటి పనిమనిషిపై (Maid) అత్యాచారానికి పాల్పడినందుకు భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్ట్ (Singapore Court) 18 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో పాటు 12 కొరడా దెబ్బలు కూడా శిక్షగా విధించినట్లు అక్కడి స్థానిక మీడియా తెలియజేసింది.
సింగపూర్ జలసంధి గుండా వెళుతున్న రాయల్ కరేబియన్ క్రూయిజ్ నుంచి దూకి 64 ఏళ్ల ఓ భారతీయ మహిళ మృతి చెందినట్లు సమాచారం. దాంతో ఆమె కుమారుడు తన తల్లిని కనిపెట్టడంలో సహాయం చేయాల్సిందిగా ప్రధాన మంత్రి కార్యాలయం (PMO), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs)ను కోరాడు.
అయిదేళ్ల క్రితం సింగపూర్లో ఓ భారతీయ వృద్ధురాలిని చంపిన కేసులో మయాన్మార్ యువతికి సింగపూర్ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. తొలుత యువతి వారింట్లో పనిమనిషిగా చేరింది. ఆ తరువాత వృద్ధురాలికి యువతి పని నచ్చక ఆమెను పంపించేస్తానని అని వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో కోపోద్రిక్తురాలైన యువతి ఆమెను కత్తితో పొడిచి చంపేసింది.
సింగపూర్ ( Singapore ) లో విషాద ఘటన జరిగింది.
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో జూలై 9 (ఆదివారం) సాయంత్రం 6 నుండి 10 గంటల వరకు బోనాల పండుగని శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో అత్యంత భక్తి శ్రద్దలతో ఆనంద ఉత్సవాలతో 500 మందికి పైగా భక్తులతో కన్నుల పండగగా జరిగింది.
బాలికలతో అసభ్యకరంగా వ్యవహరించిన ఓ భారతీయుడికి అక్కడి న్యాయస్థానం మూడు నెలల నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధించింది.