Home » Smriti Irani
సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం హోరా హోరీగా సాగుతోంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కేంద్ర మంత్రి, అమేఠీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు బీజేపీ సిద్దమని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో రాయ్‌బరేలీ, అమేథీ ముందు వరుసలో ఉన్నాయి. గాంధీ కుటుంబానికి ఈ రెండు స్థానాలు ఎప్పటినుంచో సంప్రాదాయక సీట్లుగా ఉన్నాయి. కానీ 2019లో అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి చవిచూడగా.. రాయ్‌బరేలీలో సోనియాగాంధీ విజయం సాధించారు. ఈసారి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో.. రాయ్‌బరేలీ నుంచి ఆమె వారసుడిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమేథి నుంచి పోటీ చేస్తే సరదాగా ఉండేదని బీజేపీ గోరఖ్ పూర్ సిట్టింగ్ ఎంపీ, నటుడు రవి కిషన్ అభిప్రాయ పడ్డారు. గత రాత్రి వరకు ఉత్కంఠతో ఎదురు చూశా.. ఆట మొదలు కాకముందే ముగిసింది. ఒకవేళ అమేథిలో స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ పోటీ చేసి ఉంటే సరదాగా ఉండేదని సెటైర్లు వేశారు.
అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిషోరీ లాల్ శర్మ పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వ్యంగ్య బాణాలు సంధించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆమె మాట్లాడుతూ.. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల బరిలో దిగడం.. అమేఠీ ప్రజల విజయమని ఆమె అభివర్ణించారు.
అమేథి లోక్ సభ నియోజకవర్గం నుంచి గాంధీ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. గత 31 ఏళ్ల నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలోకి దిగారు. అమేథితో గాంధీ కుటుంబానికి 1980 నుంచి అనుబంధం ఉంది.
Lok Sabha Polls 2024: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై(Raghul Gandhi) కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ ఏప్రిల్ 26 తరువాత అమేథీలో(Amethi) పర్యటించాలని యోచిస్తున్నారని, నియోజకవర్గంలో కుల చిచ్చు రగిల్చే కుట్రకు తెరలేపుతున్నారని కేంద్ర మంత్రి..
కాంగ్రెస్-కమ్యూనిస్టులపై కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములు.. అయినప్పటికీ వాయనాడులో సీపీఐ తమ అభ్యర్థిగా అన్నీ రాజాను బరిలోకి దింపింది. కూటమి వైఖరికి విరుద్దంగా కమ్యూనిస్టులు వ్యవహరించారని స్మృతి ఇరానీ మండిపడ్డారు.
రాహుల్ గాంధీని టార్గెట్ చేసింది బీజేపీ. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ అమేథీలో ఓడిపోయారు. వయనాడ్‌లో మాత్రం గెలిచారు. ఈ ఎన్నికల్లో కేవలం వయనాడ్ నుంచి మాత్రమే రాహుల్ పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షులు కె సురేంద్రన్‌ను బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ (Congress) కంచుకోట అమేఠీ నియోజకవర్గం (Amethi Constituency) నుంచి ఇంతవరకు తమ అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించకపోవడంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ అభ్యర్థిని ప్రకటించడంలో వాళ్లు ఆలస్యం చేస్తున్నారంటే.. అమేఠీ పవర్ ఏంటో వాళ్లు గ్రహించినట్లు కనిపిస్తోందని, ఆ పార్టీని ఓటమి భయం వెంటాడుతోందని సెటైర్లు వేశారు.
లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గర పడుతున్న తరుణంలో.. రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే బీజేపీ (BJP) 195 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయగా.. ఇండియా కూటమి (India Alliance) ఇంకా సీట్ల సర్దుబాటు విషయంపై చర్చలు జరుపుతోంది. అయితే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈసారి ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్నది గత కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్‌గా మారింది.