Share News

Trains: 27నుంచి హైదరాబాద్‌-కటక్‌ మార్గంలో ఎనిమిది ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Aug 21 , 2024 | 01:31 PM

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌-కటక్‌(Secunderabad-Cuttack) మార్గంలో ఎనిమిది ప్రత్యేకరైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది.

Trains: 27నుంచి హైదరాబాద్‌-కటక్‌ మార్గంలో ఎనిమిది ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌ సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌-కటక్‌(Hyderabad-Cuttack) మార్గంలో ఎనిమిది ప్రత్యేకరైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. ఈనెల 27నుంచి సెప్టెంబర్‌ 17వరకు ప్రతి మంగళవారం హైదరాబాద్‌ నుంచి కటక్‌కు, 28నుంచి సెప్టెంబర్‌ 18వరకు ప్రతి బుధవారం కటక్‌ నుంచి హైదరాబాద్‌కు ఈ ప్రత్యేకరైళ్లు నడుస్తాయని సీపీఆర్‌వో శ్రీధర్‌ తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: చిత్రపురి కాలనీలో విల్లా కూల్చివేత


మార్గమధ్యంలో సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ(Nalgonda, Miryalaguda, Sattenapally, Guntur, Vijayawada), ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం(Annavaram, Anakapalli, Duvvada, Kothavalasa, Vijayanagaram), శ్రీకాకుళం, బర్హంపూర్‌, కుర్ధా, భువనేశ్వర్‌ స్టేషన్లలో ఈ రైళ్లకు హాల్ట్‌ ఉంటుందని పేర్కొన్నారు.


..................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.....................................................................

Hyderabad: పలురైళ్ల రద్దు.. కొన్ని దారి మళ్లింపు

హైదరాబాద్‌: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌(Hyderabad, Secunderabad) డివిజన్‌లలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా సెప్టెంబర్‌ 1నుంచి 30వ తేదీ వరకు సికింద్రాబాద్‌-వరంగల్‌ ఎంఈఎంయూ(07462) రైలు, వరంగల్‌-హైదరాబాద్‌ ఎంఈఎంయూ రైలు (07463), కాజీపేట-బల్లార్షా (17035), సెప్టెంబర్‌ 2నుంచి అక్టోబర్‌ 1వరకు బల్లార్షా-కాజీపేట (17036), సెప్టెంబర్‌ 1నుంచి 30వరకు సిర్పూర్‌టౌన్‌-కరీంనగర్‌ ఎంఈఎంయూ (07766), కరీంనగర్‌-బోధన్‌ ఎంఈఎంయూ(07894), నవంబర్‌ 2నుంచి


అక్టోబర్‌ 1వరకు బోధన్‌-కరీంనగర్‌ ఎంఈఎంయూ (07893), కరీంనగర్‌-సిర్పూర్‌ టౌన్‌ (07765), నవంబర్‌1నుంచి 30వరకు కాచిగూడ-నడికుడి(07791), నడికుడి-కాచిగూడ (07792) రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌1నుంచి 30వరకు హెచ్‌ఎ్‌స.నాందేడ్‌-రాయిచూర్‌(17664) రైలును తాండూర్‌-రాయచూర్‌ల మధ్య, సెప్టెంబర్‌2 నుంచి అక్టోబర్‌ 1వరకు రాయిచూర్‌-పర్భని (17663) రైలును రాయిచూర్‌-తాండూర్‌ల మధ్య పాక్షికంగా రద్దు చేసినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 21 , 2024 | 01:31 PM