Share News

Special trains: దసరా-దీపావళి పండగలకు 48 ప్రత్యేక రైళ్లు..

ABN , Publish Date - Sep 18 , 2024 | 08:30 AM

రానున్న దసరా, దీపావళి, ఛాట్‌ ఫెస్టివల్స్‌(Dussehra, Diwali, Chat Festivals) సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి 48 ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Special trains: దసరా-దీపావళి పండగలకు 48 ప్రత్యేక రైళ్లు..

హైదరాబాద్‌: రానున్న దసరా, దీపావళి, ఛాట్‌ ఫెస్టివల్స్‌(Dussehra, Diwali, Chat Festivals) సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి 48 ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌21నుంచి నవంబర్‌ 27వరకు (సోమ, బుధవారాల్లో) నాందేడ్‌(Nanded) నుంచి పన్వెల్‌ (07625)కు 12 ప్రత్యేక రైళ్లు, అక్టోబర్‌ 22నుంచి నవంబర్‌ 28 వరకు (మంగళ, గురువారాల్లో) పన్వెల్‌ నుంచి నాందదేడ్‌ వరకు 12 ప్రత్యేక రైళ్లు (07626), అక్టోబర్‌ 11నుంచి నవంబర్‌ 29వరకు (శుక్ర) కొచువెలినుంచి నిజాముద్దీన్‌ వరకు 8 ప్రత్యేక రైళ్లు (06071) అక్టోబర్‌ 14నుంచి డిసెంబర్‌ 2 వరకు (సోమ) నిజాముద్దీన్‌-కొచువెలి(Nizamuddin-Kochuveli) వరకు 8 ప్రత్యేక రైళు(06072), అక్టోబర్‌ 21నుంచి నవంబర్‌ 11వరకు (సోమ) పూణె నుంచి కరీంనగర్‌ వరకు 4 ప్రత్యేక రైళు(01451), అక్టోబర్‌ 23నుంచి నవంబర్‌ 13వరకు బుధ) కరీంనగర్‌ నుంచి పూణె వరకు 4 ప్రత్యేక రైళ్లు (01452) నడుపనున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Hashish Oil: డ్రగ్స్ కంటే ప్రమాదకారి.. ఎలా తయారు చేస్తారంటే..


......................................................................

ఈ వార్తను కూడా చదవండి:

......................................................................

Hyderabad: పక్కనే నిల్చున్నారు.. అయినా మాటల్లేవ్‌..

- ఒకే వేదికపై ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు

- బాలాపూర్‌ గణేశ్‌ శోభాయాత్రలో ఆసక్తికర పరిణామం

హైదరాబాద్: గతంలో ఒకే పార్టీలో ఉన్న ముగ్గురు మహిళా నేతలు ప్రస్తుతం ఉప్పూనిప్పులా మారారు. వారిలో ఇద్దరు పార్టీ మారగా, ఒకరు మాత్రం అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఆ ముగ్గురూ మంగళవారం బాలాపూర్‌(Balapur)లో జరిగిన గణేశ్‌ శోభాయాత్రలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. వారే మేయర్‌ పారిజాత, జడ్పీ మాజీ ఛైర్మన్‌ అనిత, ఎమ్మెల్యే సబితారెడ్డి(MLA Sabita Reddy). బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభానికి ముందే అతిథులను బొడ్రాయి వద్ద గల ఓ ఇంటిపైకి ఆహ్వానిస్తుంటారు. ఈసారి సైతం సదరు ఇంటిపైకి ఎమ్మెల్యే సబితారెడ్డి, మేయర్‌ పారిజాతారెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మన్‌ అనితారెడ్డి చేరుకుని పక్కపక్కనే నిల్చున్నారు. సబిత పక్కన బీఆర్‌ఎస్‌ మహిళా నేత వంగేటి లక్ష్మీరెడ్డి ఉన్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం వారు స్పీచ్‌ ఇచ్చారు.

city2.jpg


పారిజాత, అనిత గతంలో బీఆర్‌ఎస్(BRS)‏లో కొనసాగుతూ ఎమ్మెల్యే సబిత వెంటే ఉన్నారు. తర్వాత మేయర్‌ పారిజాత, జడ్పీ మాజీ ఛైర్మన్‌ అనిత కాంగ్రెస్‏లో చేరడంతో వారి మధ్య దూరం పెరిగింది. దాంతో ఆ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూశారు. ఒకరినొకరు పలకరించుకుంటారేమో అని ఎదురు చూశారు. కానీ పారిజాత, అనిత ఓ వైపు చూస్తూ నిల్చోగా, సబిత తన పక్కన ఉన్న లక్ష్మితో ముచ్చటిస్తూ కనిపించారు. దీంతో ‘నాడు చెట్టపట్టాలేసుకుని మన ఊరికి వచ్చింది ఈ ముగ్గురేనా?.. ఇప్పుడేమో ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నారు..!’ అని స్థానికులు గుసగుసలాడుకోవడం కనిపించింది.


ఇదికూడా చదవండి: తుపాకీరాముడిని మరిపిస్తున్న కౌశిక్‌రెడ్డి: మల్లు రవి

ఇదికూడా చదవండి: ప్రతి నియోజకవర్గానికీ ఎంఎస్ఎంఈ పార్కు

ఇదికూడా చదవండి: రాసిపెట్టుకో.. రాజీవ్‌ విగ్రహం తొలగిస్తాం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 18 , 2024 | 08:30 AM