Share News

Waqf Amendment Act: ‘వక్ఫ్‌’ పిటిషన్లపై సుప్రీం విచారణ నేడే

ABN , Publish Date - Apr 16 , 2025 | 07:38 AM

సుప్రీంకోర్టు వక్ఫ్‌ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లపై విచారణ ప్రారంభించనుంది. ఈ చట్టం రాజ్యాంగానికి విరుద్ధమని, జాతీయ సమగ్రతకు ముప్పు కలిగించేదిగా పేర్కొంటూ పిటిషన్లు దాఖలైనవి.

Waqf Amendment Act: ‘వక్ఫ్‌’ పిటిషన్లపై సుప్రీం విచారణ నేడే

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేసిన వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం (ఏప్రిల్‌ 16న) విచారణ చేపట్టనుంది. కొత్త చట్టంలోని పలు సెక్షన్లు రాజ్యాంగానికి విరుద్ధమని, జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ పిటిషన్‌ సహా ఇప్పటికే పది పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించనుంది. మరోవైపు కొత్త వక్ఫ్‌ చట్టంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. ఆ చట్టంలోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్‌ న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్టు చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ ధర్మాసనం మంగళవారం వెల్లడించింది. దీనిపై విచారణ చేపట్టే తేదీని త్వరలో ఖరారు చేస్తామని తెలిపింది.

Updated Date - Apr 16 , 2025 | 07:38 AM