Share News

Tejashwi Yadav: విరాట్ కోహ్లీ నా కెప్టెన్సీలో ఆడాడు.. ఆసక్తికర ట్వీట్ చేసిన బీహార్ నేత తేజస్వి యాదవ్..

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:19 AM

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో తన అనుబంధం గురించి ట్వీట్ చేసిన తేజస్వి, అప్పుడు కోహ్లీతో దిగిన ఫొటోను కూడా పంచుకున్నాడు.

Tejashwi Yadav: విరాట్ కోహ్లీ నా కెప్టెన్సీలో ఆడాడు.. ఆసక్తికర ట్వీట్ చేసిన  బీహార్ నేత తేజస్వి యాదవ్..
Tejashwi Yadav with Virat Kohl

బీహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) తాజాగా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో (Virat Kohli) తన అనుబంధం గురించి ట్వీట్ చేసిన తేజస్వి, అప్పుడు కోహ్లీతో దిగిన ఫొటోను కూడా పంచుకున్నాడు. బీహార్ మాజీ మంత్రి కూడా అయిన తేజస్వి యాదవ్‌కు క్రికెట్‌తో కనెక్షన్ ఉంది. దాని గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. రాజకీయాల్లోకి రాకముందు తేజస్వి కూడా క్రికెటర్. ఐపీఎల్‌ (IPL)లో ఢిల్లీ తరఫున కూడా ఆడాడు. క్రికెట్‌తో తనకున్న అనుబంధం గురించి తేజస్వి వెల్లడించాడు.


తేజస్వి యాదవ్ ఢిల్లీ రాష్ట్ర జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఢిల్లీ తరఫున అండర్ -15, అండర్ -19 జట్లలో తేజస్వి, విరాట్ కోహ్లీ ఆడాడట. ఆ సమయంలో తేజస్వి ఢిల్లీ టీమ్‌కు కెప్టెన్ కూడా అయ్యాడు. తేజస్వి కెప్టెన్సీలో కోహ్లీ ఆడాడు. ఆ తర్వాత 2008లో ఐపీఎల్ కూడా తేజస్వి ఆడాడు. అయితే గాయాల కారణంగా తేజస్వి క్రికెట్ నుంచి వైదొలిగాడు. రెండు కాళ్ల లిగ్మెంట్లు దెబ్బతినడంతో 2010లో క్రికెట్‌కు ఫుల్‌స్టాప్ పెట్టిన తేజస్వి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. తన క్రికెట్ కెరీర్ గురించి తేజస్వి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. కోహ్లీ తన కెప్టెన్సీలో ఆడాడని చెప్పుకొచ్చాడు.


``నేను గతంలో క్రికెటర్‌ను. దాని గురించి ఎవరూ మాట్లాడరు. విరాట్ కోహ్లీ నా కెప్టెన్సీలో ఆడాడు. ఆ విషయం ఎవరికైనా తెలుసా? ఓ ప్రొఫెషనల్ క్రికెటర్‌గా నేను ఉత్తమంగా ఆడాను. జాతీయ జట్టు తరఫున ఆడిన చాలా మంది క్రికెటర్లు నా బ్యాచ్‌మేట్స్. నా కాళ్ల లిగ్మెంట్లు దెబ్బతినడం కారణంగా నేను క్రికెట్‌ను వదిలేయాల్సి వచ్చింది. ఏది జరగాలో అదే జరుగుతుంది`` అంటూ తేజస్వి యాదవ్ స్పందించాడు. కాగా, కోహ్లీతో గతంలో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇవి కూడా చదవండి..

MS Dhoni: ధోనీని చూసి ఎవడ్రా బాబూ అనుకున్నా.. చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న ఆకాశ్ చోప్రా..


Longest Test match: 11 రోజులు.. 680 ఓవర్లు.. అంపైర్లకు చిరాకు తెప్పించిన ఆ టెస్ట్ మ్యాచ్ వివరాలు తెలిస్తే..


Team India: విదేశీయుడికి టీమ్ ఇండియా కొత్త బౌలింగ్ కోచ్ బాధ్యతలు


Virat Kohli: స్వదేశానికి వచ్చేసిన విరాట్.. మరో రికార్డుకు చేరువలో కోహ్లీ


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 15 , 2024 | 11:39 AM