Home » Telangana BJP
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ పూర్తైంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. రెండు, మూడు స్థానాల్లోనే బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటింగ్ సరళి పరిశీలించిన తర్వాత ఆయా పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి.
ఎండలు మండిపోతుండడంతోపాటు మరోవైపు గ్రేటర్లో పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ సమీపిస్తుండడంతో అభ్యర్థులు తీవ్రంగా చెమటోస్తున్నారు. మండే ఎండను లెక్క చేయకుండా గెలుపునకు శ్రమిస్తున్నారు..
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎటుచూసినా ఎలక్షన్ హీట్ కొనసాగుతూనే ఉంది. ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచేశాయి. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు విచ్చేశారు. తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు దక్కించుకోవాలన్నదే టార్గెట్‌గా కమలనాథులు పావులు కదుపుతున్నారు...
గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఎం. రఘునందనరావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నో రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారని.. అయితే కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ ఐదు నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌లపై మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్ రావు నిప్పులు చెరిగారు. ఆదివారం మెదక్‌లో బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి, కేసీఆర్ వేర్వేరు కాదన్నారు. వారిద్దరు వీణా వాణిలాగా అవిభక్త కవలలని అభివర్ణించారు. కేసీఆర్ తీసుకు వచ్చిన జీవో 51ని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.
ఆయన ఓ పార్టీ అగ్ర నేత.. స్వయంగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎండ దంచేస్తున్నప్పటికీ.. నామినేషన్ వేసిన ఉత్సాహంలో రోజంతా ప్రచారంలో పాల్గొన్నారు..
బీజేపీ (BJP) దెబ్బకు పాత బస్తీలో బద్ధ శత్రువులు ఏకమయ్యారా!? ఇక్కడ ఎంఐఎంకు ఎంబీటీ పరోక్ష మద్దతు ఇస్తోందా!? మజ్లిస్‌కు (AIMIM)సహకరించడానికే పోటీ నుంచి తప్పుకుందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి తాజా పరిణామాలు..
లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) పోలింగ్‌కు మరో పక్షం రోజుల సమయమే ఉండడంతో బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు, వీధి సమావేశాలు, ఇంటింటి ప్రచారం ఉధృతం చేసింది..
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బొర్లకుంట వెంకటేశ్ నేత బీజేపీ వైపు చూస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టికెట్ ఇస్తే బీజేపీలో చేరతానని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి ప్రతిపాదన పెట్టారని సమాచారం. దీంతో పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించిన గొమాసే శ్రీనివాస్‌ను మార్చి వెంకటేశ్ నేతకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది..
Telangana: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక రేపటి (గురువారం) నుంచి నామినేషన్ల ఘట్టం కూడా మొదలుకానుంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటు తెలంగాణ బీజేపీ మాత్రం నామినేషన్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి సరికొత్త రీతిలో నామినేషన్లను వేయించాలని బీజేపీ నిర్ణయించింది.