Home » Telangana Congress
తెలంగాణ కొత్త లోగో (కొత్త రాజముద్ర) దాదాపు ఖరారయ్యిందని గత 24 గంటలుగా హడావుడి జరిగిన సంగతి తెలిసిందే. అదిగో ఇదిగో రిలీజ్ అంటూ కాంగ్రెస్ నేతల మాటలు.. ఇక సోషల్ మీడియాలో అయితే ఇదిగో ఇదే ఫైనల్ అని ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు. ఓటరు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ 14 సీట్లు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది.
హైదరాబాద్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. అల్లర్లపై దర్యాప్తు కోసం వేసిన సిట్ వెస్ట్ అని, దానివల్ల ఉపయోగం లేదని అన్నారు.
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ పూర్తైంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. రెండు, మూడు స్థానాల్లోనే బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటింగ్ సరళి పరిశీలించిన తర్వాత ఆయా పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి.
ఎండలు మండిపోతుండడంతోపాటు మరోవైపు గ్రేటర్లో పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ సమీపిస్తుండడంతో అభ్యర్థులు తీవ్రంగా చెమటోస్తున్నారు. మండే ఎండను లెక్క చేయకుండా గెలుపునకు శ్రమిస్తున్నారు..
ఆయన ఓ పార్టీ అగ్ర నేత.. స్వయంగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎండ దంచేస్తున్నప్పటికీ.. నామినేషన్ వేసిన ఉత్సాహంలో రోజంతా ప్రచారంలో పాల్గొన్నారు..
నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటివరకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు సమానస్థాయిలో ప్రాతినిధ్యం దక్కింది. నియోజకవర్గానికి మొత్తం 17 పర్యాయాలు ఎన్నికలు జరిగితే, సీపీఐ, కాంగ్రెస్ చెరి ఏడు పర్యాయాలు గెలుపొందాయి. తెలంగాణ ప్రజాసమితి ఒకసారి విజయం సాధించగా..
ఖమ్మం సీటుపై మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన వియ్యంకుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామరెడ్డిని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్ఠానం నిర్ణయించింది. ఖమ్మం సీటుకు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి సుమారు రూ.300 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కానీ ఆయనకు సొంత కారు లేదు. ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం..