Home » Telangana Formation Day
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్2వ తేదీన రాష్ట్ర ద్విశాబ్ధి ముంగిపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవానికి హాజరు కావాల్సిందిగా కోరారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకే కేసీఆర్ కలిసి ఆహ్వానించినట్లు వేణుగోపాల్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ పంపిన ఆహ్వాన లేఖను కేసిఆర్‌కు అందజేశానన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్2వ తేదీన రాష్ట్ర ద్విశాబ్ధి ముంగిపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
సంగీతంలో ప్రాంతీయ భేదాన్ని తీసుకురావడం మంచిది కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రా గీతానికి సంగీత దర్శకత్వ బాధ్యతలు కీరవాణికి అప్పగించడంపై బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ వాదాన్ని తీసుకురావడం సరికాదని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ వేడుకలు నిర్వహించడాన్ని తాము స్వాగతిస్తున్నామని జన సమితి అధ్యక్షుడు, ప్రోఫెసర్ కోదండ రాం (Kodandaram) తెలిపారు.మొట్ట మొదటి సారిగా తమను ఆవిర్భావంతో ఈ ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తుందని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఈ ఆహ్వానం దొరకలేదని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ధి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం ఆహ్వాన లేఖ రాశారు. జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా లేఖ రాశారు.