Home » TG News
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ(Online food delivery) సంస్థ ఈ ఏడాది తమ ప్లాట్‌ఫామ్‌పై భారతీయులు ఏ విధంగా ఫుడ్‌ను శోధించారో తెలుపుతూ 9వ ఎడిషన్ నివేదికను ‘హౌ ఇండియా స్విగ్గీడ్’ శీర్షికన విడుదల చేసింది. ఈ ఏడాది 8.3 కోట్ల(83 మిలియన్) బిర్యానీలను స్విగ్గీలో ఆర్డర్ చేశారు.
యువకుడి హత్య కేసును 48 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. తండ్రీకొడుకులే సూత్రధారులని నిర్ధారించి వారిని అరెస్ట్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్‌జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్, ఏసీపీ గోపాలకృష్ణమూర్తి వివరాలు వెల్లడించారు.
వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోయి.. .జీవితంపై విరక్తితో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామాయిపల్లిలో రైతు బత్తుల రాజు (40) అప్పులు చేసి బోర్లు వేయగా ఫలితం దక్కలేదు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలంలోని కొండపల్లి, ఎర్రగుట్ట, పోతెపల్లి, దర్గపల్లి, లోడ్పల్లి గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో సోమవారం పులి కదలికలు కలకలం రేపాయి.
బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ దాతల సాయంతో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న తన కుమారుడు ఇప్పుడు డిశ్చార్చి అయ్యేందుకు దాతలు సహకరించాలని ఓ తల్లి కోరారు.
దేశవ్యాప్తంగా బొగ్గు రంగంలో వస్తున్న సవాళ్లను అధిగమించి సింగరేణి సంస్థను ప్రగతిపథంలో నడిపిస్తామని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మెదక్ చర్చ్ వందేళ్ల ఉత్సవాల్లో భాగంగా చర్చి స్థాపకుడు పాస్నెట్‌కు కృతజ్ఞత సభ నిర్వహించారు.
దేశంలోనే సైబర్ నేరాల్లో టాప్-5లో ఉన్న తెలంగాణలో.. బాధితులు ఈ ఏడాది ఏకంగా రూ.1,866.9 కోట్ల సొమ్మును పోగొట్టుకున్నారు. రికవరీలు మాత్రం పట్టుమని పదిశాతం కూడా లేకుండా.. రూ.176.71 కోట్లకు పరిమితం కావడం గమనార్హం..!
సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో తలెత్తిన వివాదం మరో మలుపు తిరిగింది. తన అన్న విష్ణు, ఆయన అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ మోహన్‌బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్.. రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సినీ నటుడు మోహన్‌బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.