Home » Thanneeru Harish Rao
పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజల వసరాలు తీర్చేలా పని చేస్తానని దుబ్బాక బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ( Kotha Prabhakar Reddy ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు దుబ్బాకలో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ... 54 వేల మెజార్టీతో తనను గెలిపించి తన మీద చాలా బాధ్యత పెట్టారని కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారని.. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల కోడ్‌ని సాకుగా చూపి హామీలను అమలు చేయరేమోననిపిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ( Harish Rao ) తెలిపారు. ఆదివారం నాడు ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే ఎలా అనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. దరఖాస్తులతో కోడ్ వరకు సాగదీసి కోడ్‌ను సాకుగా చూపి హామీలను అమలు చేయరనిపిస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
భారతీయ పండితుడు, సాహిత్యవేత్త మరియు అవధాని గరికపాటి నరసింహారావు ( Garikapati Narasimha Rao ) ప్రవచనాలు చాలా గొప్పవని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ( Harish Rao ) వ్యాఖ్యానించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న ‘‘చాణక్య విలువలు గరికపాటి నరసింహరావు ప్రవచనాలు’’ కార్యక్రమంలో సోమవారాం నాడు పాల్గొన్నారు.
కొందరు మానసిక వికలాంగుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తారని.. అది మంచి పద్ధతి కాదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ( Tanniru Harish Rao ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్లో అభయ జ్యోతి మనో వికాస కేంద్రం ఆధ్వర్యంలో సోలార్ సిస్టమ్, మానసిక వికలాంగులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రారంభించారు.
పేద ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ( Harish Rao ) సూచించారు. శనివారం నాడు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 153మందికి కళ్యాణలక్ష్మీ, జీఓ 59కింద 71మందికి పట్టాల పంపిణీ చేశారు.
క్రైస్తవులకు క్రిస్మస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ( Harish Rao ) శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్లో క్రిస్టిమస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీలో విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి హరీష్ రావుకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ పోడియంలోకి ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. అయితే గులాబీ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి శ్రీధర్ బాబు అసహనం వ్యక్తం చేశారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. కాళేశ్వరంపై వెంటనే సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.
హైదరాబాద్: కేంద్రం నుంచి రావలసిన రూ. లక్ష కోట్లు రాకపోవడం వల్ల ఆర్థికంగా రాష్ట్రానికి ఇబ్బంది కలిగిందని, ఎస్వీపీలను అప్పులుగా తప్పుగా చూపించారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లఘు చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ..
Telangana: రాష్ట్రమంతా కొంత ఇబ్బంది ఉన్నా సంగారెడ్డిలో మాత్రం ఈ సారి గులాబీ జెండా ఎగిరిందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి మాట్లాడుతూ.. చింతా ప్రభాకర్ ఆరోగ్యం దెబ్బ తిన్నా ప్రతి ఒక్క కార్యకర్త అభ్యర్థిగా కష్టపడి పని చేశారన్నారు.