Home » Thanneeru Harish Rao
హామీలు అమలు చేసే వరకూ రేవంత్‌ను వదిలిపెట్టామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు హెచ్చరించారు. ఒక్క బస్సు తప్ప రేవంత్ పాలన అంతా తుస్సేనని విమర్శించారు. రైతులు చనిపోయినా రేవంత్‌కు కనికరం లేదా అని ప్రశ్నించారు. ప్రజల నుంచి నిరసన వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను రైతులు నిలదీయాలని అన్నారు.
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా నిర్లక్ష్యం వీడలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఫలితంగా ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం , ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. మూడు, నాలుగు వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేసి.. మిగిలిన 10 వేల ఎకరాలను ప్లాట్లు చేసి అమ్మే కుట్ర చేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో మూసి పక్కన ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు హామీ ఇచ్చారు. ముకేష్ అంబానీ తలుచుకుంటే మధ్యతరగతి వారు తీసుకున్న లోన్లు మాఫీ చేయొచ్చని అన్నారు.
డిటోనేటర్లు పెట్టి మల్కాపూర్ చెరువులో కట్టడాలను కూల్చివేసిన అధికారులు, ఇప్పుడు హైడ్రాకి, హోంగార్డు గోపాల్ చనిపోవడానికి ఎలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకోవడం సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఈ సంఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. హోంగార్డు గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు తెలంగాణను అతలాకుతలం చేశాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. లనీలు పూర్తిగా వరద నీటితో నిండిపోగా, జనజీవనం స్తంభించిపోయిందని తెలిపారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారని చెప్పారు
100 రోజుల్లో రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను పూర్తిగా ఎందుకు అమలు చేయలేదని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నించారు. డిసెంబర్ 9న రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని మోసం చేశారని హరీష్‌రావు అన్నారు. కేసీఆర్ సీఎం కాగానే మొదటి నెలలోనే రూ 2 వేల పింఛన్ ఇచ్చారని హరీష్‌రావు గుర్తుచేశారు.
తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 38నెలలు టీపీసీసీ అధ్యక్షుడిగా పార్టీని ముందుకు తీసiకెళ్లానని తెలిపారు. ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా పూరించి వెనక్కి తిరిగి చూడలేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రీజ పాల ఉత్పత్తి కేంద్రం హరీష్‌రావు బినామీ అని.. ఆ పేరుతో ఆయన చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడటం తగదని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలోని పోలీస్ కన్వేషన్ హల్లో జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో ఈరోజు (శనివారం) గురుపూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార మహోత్సవం జరిగింది.