Home » Thatikonda Rajaiah
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్!. బీఆర్ఎస్లో (BRS) టికెట్ దక్కని ముఖ్యనేతలు, సిట్టింగులంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో (Thummala Nageswara Rao) కాంగ్రెస్ నేతలు (Congress Leaders) వరుస భేటీలు అవుతున్నారు..
పాలకుర్తి మండలం వల్మిడి సీతారాముల ఆలయం పున: ప్రతిష్టలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇంతకాలం ఉప్పు - నిప్పులా ఉన్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఒకే వేదికపై ఒకరికొకరు తారసపడ్డారు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని చక్కగా పలకరించుకున్నారు.
స్టేషన్ ఘనపూర్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టికెట్ రేసులో తాను సైతం అని జానకిపురం సర్పంచ్ నవ్య అంటున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని అధినేత కేసీఆర్‌కు ఆమె అర్జీ పెట్టుకుంటున్నారు.
బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ టికెట్ నిరాకరణ తర్వాత స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో తొలిసారిగా మాట్లాడారు.
స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ తనకే అంటూ ఆశించిన రాజయ్యకు నిరాశే ఎదురైంది. నిన్న సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ జాబితాలో రాజయ్యకు చోటు దక్కలేదు. స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ రాజయ్యకు కాకుండా కడియం శ్రీహరికి ఇస్తూ బీఆర్ఎస్ అధినేత నిర్ణయం తీసుకున్నారు. దీంతో టికెట్ ఆశించిన రాజయ్యకు భంగపాటు తప్పలేదు.
ఏ దేవుడి దయతోనే చివరి నిమిషంలోనైనా టికెట్ దక్కుతుందని ఎదురుచూసిన రాజయ్యతోపాటు ఆయన అనుచరులకు భంగపాటు తప్పలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన తాటికొండ రాజయ్య భవిష్యత్ కార్యచరణపై దృష్టిపెట్టబోతున్నారని తెలుస్తోంది.
స్టేషన్ ఘనపూర్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య-ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య టికెట్ వార్ ప్రారంభమైంది. అసలే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం తెలిసిందే.
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ పిలిస్తే ప్రగతిభవన్‌కు వచ్చానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. కేటీఆర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనవసర వివాదాలు వద్దని మంత్రి చెప్పారన్నారు.
హైదరాబాద్: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య వివాదం జరగిన నేపథ్యంలో మంగళవారం మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే రాజయ్యను ప్రగతిభవన్‌కు పిలిపించి క్లాస్ తీసుకున్నారు.