Home » Toll Plaza
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారు హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు ఓట్లు వేసిన తర్వాత సోమవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ బాట పట్టారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది.
Andhrapradesh: ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికుల వాహనాలతో జాతీయ రహదారి కిక్కిరిసి పోయింది. మే 13న పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రాకు ప్రయాణికులు తరలివెళ్తున్నారు. దీంతో సంక్రాంతిని మరిపించే విధంగా వాహనాల రద్దీ కొనసాగుతోంది.
జాతీయ రహదారులపై టోల్ ఫీజు పెంపుదలను రెండు నెలలపాటు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.