Share News

AP Elections: ‘ఓట్ ఫర్ చేంజ్’ అంటున్న ఆంధ్రావాసులు.. టోల్‌ప్లాజాల వద్ద వాహనాల వరద

ABN , Publish Date - May 11 , 2024 | 12:11 PM

Andhrapradesh: ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికుల వాహనాలతో జాతీయ రహదారి కిక్కిరిసి పోయింది. మే 13న పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రాకు ప్రయాణికులు తరలివెళ్తున్నారు. దీంతో సంక్రాంతిని మరిపించే విధంగా వాహనాల రద్దీ కొనసాగుతోంది.

AP Elections: ‘ఓట్ ఫర్ చేంజ్’ అంటున్న ఆంధ్రావాసులు.. టోల్‌ప్లాజాల వద్ద వాహనాల వరద
Toll plazas on highway cause huge traffic jams

అమరావతి, మే 11: ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికుల వాహనాలతో జాతీయ రహదారి కిక్కిరిసి పోయింది. మే 13న పోలింగ్ (AP Elections 2024) నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad), తెలంగాణలోని (Telangana) ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రాకు (Andhrapradesh) ప్రయాణికులు తరలివెళ్తున్నారు. దీంతో సంక్రాంతిని మరిపించే విధంగా వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి వాహనాల వరద ప్రారంభమవగా... ఇప్పటికీ వాహనాల రాక ఇంకా కొనసాగుతోంది.

Voter ID: మీకు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా.. ఇలా ఓటు వేయొచ్చు


వాహనాల రద్దీ నేపథ్యంలో గట్టు భీమవరం, కీసర టోల్ ప్లాజాల వద్ద సిబ్బంది అదనపు గేట్లను తెరిచారు. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలతో ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, భవానిపురంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. స్వంత వాహనాలతో పాటు హైదరాబాద్‌లో ఉంటున్న ఆయా నియోజకవర్గాలకు చెందిన వారు కూడా ప్రత్యేక బస్సులు పెట్టుకుని మరీ స్వగ్రామాలకు పయనమయ్యారు. ఓట్ ఫర్ చేంజ్ అంటున్నారు ఆంధ్ర వాసులు.

Friendship Marriage: ఏమిటీ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్? జపాన్‌లో యువతీయువకుల కొత్త డేటింగ్ గురించి తెలుసా?


మరోవైపు ప్రయాణికులతో విజయవాడ (Vijayawada) పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ కిక్కిరిసిపోయింది. పొరుగు రాష్ట్రాల నుంచి బస్సుల్లో వస్తున్న ఆంధ్ర వాసులు విజయవాడ బస్ స్టాండ్‌లో మారి స్వగ్రామాలకు పయనమవుతున్నారు. అటు విదేశాల నుంచి కూడా ఆంధ్రా జనం భారీగా తరలివస్తున్నారు. గత రాత్రి ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు ఫుల్ అకుపెన్సీ అయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానాల్లో అమెరికా నుంచి ఆంధ్రావాసులు వచ్చారు. ఆస్ట్రేలియాలోని షార్జా నుంచి ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్‌కు (Gannavaram Airport) రెండు ప్రత్యేక విమానాలు వచ్చాయి. గుంటూరు కృష్ణా జిల్లాల చెందిన 250 మంది షార్జా నుంచి ఏపీకి చేరుకున్నారు.


ఇవి కూడా చదవండి...

Secunderabad: ఎన్ని కుట్రలు చేసినా నివేదిత విజయం ఖరారు

Lok Sabha Elections 2024: రెండు కోట్ల విలువ చేసే మద్యం పట్టివేత

Read Latest AP News And Telugu News

Updated Date - May 11 , 2024 | 01:05 PM