గోయెంకా..మళ్లీ అదే తీరు!
ABN , Publish Date - Apr 03 , 2025 | 02:36 AM
గత సీజన్ ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నాటి కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలోనే...

లఖ్‌నవూ: గత సీజన్ ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నాటి కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలోనే క్లాస్ పీకడం పెద్ద దుమారం లేపింది. తాజాగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ ఓడిపోయింది. సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో సూపర్ జెయింట్స్‌కిది రెండో పరాజయం కావడం గమనార్హం. అలాగే కెప్టెన్ పంత్ బ్యాటుతోపాటు, సారథిగానూ విఫమయ్యాడు. ఈనేపథ్యంలో..పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ అనంతరం గ్రౌండ్‌లోనే పంత్‌తో గోయెంకా మాట్లాడాడు. ఆ సందర్భంగా పంత్‌వైపు వేలు చూపుతూ సీరియ్‌సగా ఏదో అనడం కనిపించింది. ఈ సీన్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..