‘నోట్ బుక్’ సంబరాలు.. దిగ్వే్‌షకు జరిమానా
ABN , Publish Date - Apr 03 , 2025 | 02:34 AM
ఐపీఎల్ క్రమశిక్షణ కోడ్‌ను ఉల్లంఘించిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీపై బీసీసీఐ కొరడా ఝుళిపించింది. అతడి మ్యాచ్ ఫీజులో...

లఖ్‌నవూ: ఐపీఎల్ క్రమశిక్షణ కోడ్‌ను ఉల్లంఘించిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీపై బీసీసీఐ కొరడా ఝుళిపించింది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతోపాటు రాఠీ ఖాతాలో ఓ డీ మెరిట్ పాయింట్ చేర్చారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో ప్రియాన్షు ఆర్య అవుటైనప్పుడు ఓ లెటర్ రాస్తున్నట్టుగా దిగ్వేష్ తన చేతులతో అతిగా ప్రవర్తించాడు. వెంటనే ఫీల్డ్ అంపైర్ అతడిని వారించాడు. వెస్టిండీస్ పేసర్ కెస్రిక్ విలియమ్స్ కూడా ఇలాగే వికెట్ పడగొట్టినప్పుడు ‘నోట్ బుక్’ సెలబ్రేషన్స్ చేసుకొనే వాడు. 2019 ద్వైపాక్షిక సిరీ్‌సలో కోహ్లీని అవుట్ చేసిన సమయంలో విలియమ్స్ ఇలాంటి సంబరాలే చేసుకొన్నాడు. కాగా, దిగ్వేష్ తీరును మాజీలు గవాస్కర్, కైఫ్ తప్పుబట్టారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..