Home » TS Assembly Elections
కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర అంటూ సీఎం కేసీఆర్ ( CM KCR ) , బీఆర్ఎస్ నేతలు పేపర్ ప్రకటనలు చేస్తున్నారని గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. రక్త చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేదని నర్సారెడ్డి చెప్పారు.
ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంజుమ్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థిపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈరోజు మురాద్‌నగర్‌లో ఎలక్షన్ పోలింగ్ రోజు ఏజెంట్స్ కోసం వెతుకుతున్న క్రమంలో ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.
ఎన్నికల ప్రచార సమయం నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని, అనంతరం 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ పాటించాల్సి ఉంటుందని సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ ( Congress ) గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala NageswaraRao ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్ ( Jagdeeswar Gowd ) తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
లంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ) అధికారంలోకి రాకపోతే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ( CM KCR ) గెలిచి ఏం చేస్తారని బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ( Anil Eravathri ) ప్రశ్నించారు. సోమవారం నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ ( Congress ) పార్టీతో సీఎం కేసీఆర్ ( CM KCR ) కుమ్మక్కయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) వ్యాఖ్యానించారు.
సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) ని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కలిశారు. సోమవారం నాడు వికాస్‌రాజ్‌ని కలిసిన వారిలో ఎస్టీయూ ప్రెసిడెంట్ సదానందంగౌడ్ , పీఆర్టీయూ తెలంగాణ ప్రెసిడెంట్ చెన్నయ్య తదితరులు ఉన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ( Kiran Kumar Reddy ) సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగినా.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని సీఎం కేసీఆర్ ( CM KCR ) ప్రశ్నించారు. సోమవారం నాడు జోగిపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు.
‘ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ఈ నాలుగు రోజులు మాత్రమే ఆపగలుగుతారు.
గ్రామగ్రామానా పార్టీకి నిర్మాణం ఉంది. సంప్రదాయ ఓటుబ్యాంకూ ఉంది. దశాబ్దాలుగా పార్టీయే ప్రాణంగా పనిచేస్తున్న కార్యకర్తలు, శ్రేణులకు కొదవ లేదు.