Share News

Jagadish Reddy: ప్రతిపక్షాల కుట్రతో రైతు బంధు ఆపేశారు

ABN , First Publish Date - 2023-11-27T16:18:37+05:30 IST

‘ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ఈ నాలుగు రోజులు మాత్రమే ఆపగలుగుతారు.

Jagadish Reddy: ప్రతిపక్షాల కుట్రతో రైతు బంధు ఆపేశారు

సూర్యాపేట: ఎన్నికల సంఘం రైతు బంధు ఆపివేయడం దురదృష్టకరమని మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) వ్యాఖ్యానించారు. ఆత్మకూర్( ఎస్) మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుబంధు ఆపివేయడంపై కాంగ్రెస్ పార్టీపై ఘాటుగా విమర్శలు చేశారు. ‘‘ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ఈ నాలుగు రోజులు మాత్రమే ఆపగలుగుతారు. ఎన్నికల తరువాత యథావిధిగా రైతు బంధు కొనసాగుతుంది. కేసీఆర్ గొంతులో ప్రాణం ఉన్నంతవరకు సంక్షేమ పథకాలు ఆపడం ఎవరి తరంకాదు.’’ అని మంత్రి చెప్పుకొచ్చారు.

పోరు తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - 2023-11-27T16:18:38+05:30 IST