Anil Eravathri: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే కేసీఆర్ గెలిచి ఏం చేస్తారు
ABN , First Publish Date - 2023-11-27T19:54:58+05:30 IST
లంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ) అధికారంలోకి రాకపోతే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ( CM KCR ) గెలిచి ఏం చేస్తారని బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ( Anil Eravathri ) ప్రశ్నించారు. సోమవారం నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ) అధికారంలోకి రాకపోతే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ( CM KCR ) గెలిచి ఏం చేస్తారని బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ( Anil Eravathri ) ప్రశ్నించారు. సోమవారం నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ...‘‘కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ వేసిన నాటి నుంచి ఇప్పటివరకు కామారెడ్డి ముఖం చూడలేదు. ఇక్కడి ప్రజలను ఓట్లు వేయాలని అడగలేదు. కామారెడ్డి ప్రజలంటే అంత చిన్నచూపు ఎందుకు. కామారెడ్డిలో ప్రచారానికే రాలేని కేసీఆర్ ఇక్కడ గెలిచి ప్రజలకు ఏం చేస్తారు’’ అని అనిల్ ప్రశ్నించారు.
కేసీఆర్ గెలిస్తే బులెట్ లేని తుపాకిగా మారతారు
‘‘కేసీఆర్ గెలిస్తే బులెట్ లేని తుపాకిగా మారతారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కై రైతుబంధుకు అనుమతి తెచ్చుకున్నారు. మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలతో రైతుబంధును ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. మంత్రిగా చేసిన హరీశ్‌రావుకు ఏం మాట్లాడాలో కూడా తెలియదా. బీసీ రిజర్వేషన్ల కోసం మాట్లాడుతున్న బండ ప్రకాష్ సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలి. కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలని కేంద్రానికి తీర్మానాలు పంపించాం’’ అని అనిల్ స్పష్టం చేశారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి