Home » TS Assembly
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదవ రోజు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. ఆర్థిక నిర్వహణ , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్‌పై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సభలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.
నేడు ఐదవ రోజు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఉదయం 10గంటలకు మెుదలుకానున్నాయి. శాసనసభ ప్రశోత్తారాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పైనే చర్చ జరగనుంది. ఇవాళ మెుత్తం 19పద్దులపై చర్చించనున్నారు.
తెలంగాణ ప్రజానీకం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2024-25 మరికాసేపట్లో అసెంబ్లీ ముందుకు రాబోతోంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సభలో సమర్పించనున్నారు.
హైదరాబాద్: 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజా స్వామ్యం కనిపిస్తుందని, బీఆర్ఎస్ హయం లో శాసనసభలో ప్రొటెస్ట్ చేస్తే సస్పెండ్ చేసే వారని, తెలంగాణ ఏర్పడిందే నియామకాల మీదని .. అలాంటి నియామకాలపై అధికారంలో వున్నపుడు బీఆర్ఎస్ స్పందించలేదని మంత్రి సీతక్క ఆరోపించారు.
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను ఎప్పటిలోగా, ఏ రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు.. పరిశీలనలో ఉంది.. చూస్తాం.. చేస్తామని కాలయాపన కాదని.. ఖచ్చితమైన తేదీని ప్రకటించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్‌పై ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఈ మేరకు సభలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
Telangana: అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో దివంగత స్పీకర్ శ్రీపాద రావు జయంతి వేడుకల్లో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ళలో శాసనసభ సరిగా నిర్వహించలేదన్నారు. ప్రజలకు శాసనసభలో ఏం అవుతుందో కూడా తెలియకపోయేదని అన్నారు. గత ప్రభుత్వం ప్రతిపక్షాలను మాట్లాడనివ్వలేదని విమర్శించారు. కొత్త ప్రభుత్వంలో శాసనసభలో డిబేట్ జరుగుతోందన్నారు. శాసనసభ డిబేట్లను కోట్లాది మంది చూస్తున్నారన్నారు.
Telangana: సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై పలువురు కవులు పాడిన పాటలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు సభలో వినిపించారు. సాగునీటి రంగంపై శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా.. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడీ చర్చ జరుగుతోంది.
Telangana: సాగునీటి రంగంపై శాసనసభలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగం కొనసాగుతోంది. ఈ సందర్భంగా నీటి వాటాలు, ప్రాజెక్టుల అప్పగింతలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Telangana: నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. శనివారం ఉదయం సభ మొదలైన వెంటనే నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా కుంగిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు.