Telangana Budget 2024: ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. బడ్జెట్ ప్రవేశపెడుతున్న భట్టి విక్రమార్క
ABN , First Publish Date - Jul 25 , 2024 | 10:41 AM
తెలంగాణ ప్రజానీకం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2024-25 మరికాసేపట్లో అసెంబ్లీ ముందుకు రాబోతోంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సభలో సమర్పించనున్నారు.
Live News & Update
-
2024-07-25T12:45:29+05:30
22.బీసీ సంక్షేమం - రూ.9,200 కోట్లు
23.వైద్యారోగ్యం-రూ.11,468 కోట్లు
24.విద్యుత్-రూ.16, 410 కోట్లు
25.అడవులు, పర్యావరణం-రూ.1064 కోట్లు
26.ఐటీ-రూ.774 కోట్లు
27.నీటి పారుదల - రూ.22,301 కోట్లు
28.విద్య-రూ.21,292 కోట్లు
29.హోంశాఖ - రూ.9,564 కోట్లు
30.ఆర్‌అండ్ బీ-రూ.5, 790 కోట్లు
-
2024-07-25T12:38:38+05:30
7.పంచాయతీ రాజ్ - రూ.29,816 కోట్లు
8.మహిళా శక్తి క్యాంటీన్ - రూ.50
9.హైదరాబాద్ అభివృద్ధి - రూ.10,000 కోట్లు
10.జీహెఎంసీ- రూ.3,000 కోట్లు
11. హెచ్ఎండీఏ- రూ.500 కోట్లు
12. మెట్రో వాటర్-రూ.3,385 కోట్లు
13. హైడ్రా-రూ.200 కోట్లు
14. ఏయిర్‌పోర్టుకు మెట్రో-రూ.100 కోట్లు
15. ఓఆర్‌ఆర్ - రూ.200 కోట్లు
16. హైదరాబాద్ మెట్రో-రూ.500 కోట్లు
17. ఓల్డ్ సిటీ మెట్రో- రూ.500 కోట్లు
18. మూసీ అభివృద్ధి - రూ.1500 కోట్లు
19. రీజినల్ రింగ్ రోడ్డు - రూ.1500 కోట్లు
20. స్ర్తీ, శిశు శాఖ - రూ.2736 కోట్లు
21. ఎస్సీ , ఎస్టీ సంక్షేమం-రూ.17,000 కోట్లు
22. మైనారిటీ సంక్షేమం-రూ.3000 కోట్లు
-
2024-07-25T12:30:34+05:30
వివిధ రంగాలకు కేటాయింపులు.. కోట్లలో
1. వ్యవసాయం, అనుబంధ రంగాలకు- రూ.72,659 కోట్లు
2. హార్టికల్చర్-రూ.737 కోట్లు
3. పశుసంవర్ధక శాఖ -రూ.19,080 కోట్లు
4. మహాలక్ష్మి ఉచిత రవాణా-రూ.723 కోట్లు
5. గృహజ్యోతి- రూ.2,418 కోట్లు
6. ప్రజాపంపిణీ వ్యవస్థ-రూ.3,836 కోట్లు
-
2024-07-25T12:14:47+05:30
తెలంగాణ బడ్జెట్ రూ.2 లక్షల 91 వేల 159 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2 లక్షల 20 వేల 945 కోట్లు
మూల ధన వ్యయం రూ.33 వేల 487 కోట్లు
తెలంగాణ ఏర్పాటు నాటికి రూ.75,577 కోట్ల అప్పు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.42 వేల కోట్ల బకాయిలు చెల్లింపు
-
2024-07-25T12:05:00+05:30
సభలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
-
2024-07-25T11:58:18+05:30
అసెంబ్లీకి చేరుకున్న మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్
పూలబొకే ఇచ్చి స్వాగతం పలికిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి హాజరైన మాజీ సీఎం
-
2024-07-25T11:48:21+05:30
శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసిన ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.
-
2024-07-25T11:46:54+05:30
వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు డిప్యూటీ సీఎం భట్టి నివాసం ప్రజాభవన్‌లో అమ్మ వారి ఆలయంలో పూజలు
ఆశీసులు తీసుకున్న భట్టి విక్రమార్క దంపతులు
-
2024-07-25T11:42:53+05:30
12 గంటలకు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
-
2024-07-25T11:37:03+05:30
నందినగర్‌లోని నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
-
2024-07-25T11:35:34+05:30
ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్న 2024-25 వార్షిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేసిన ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
-
2024-07-25T11:25:02+05:30
ముగిసిన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
రూ.2 లక్షల 95 వేల కోట్ల బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం
-
2024-07-25T11:03:29+05:30
కాసేపట్లో అసెంబ్లీకి కేసీఆర్
ప్రతిపక్ష నేత హోదాలో మొదటి సారి హాజరవుతున్న మాజీ సీఎం
-
2024-07-25T10:45:28+05:30
ప్రతిపక్ష నేతగా నేడు తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్..
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో ఇవాళ తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకూ ఆయన గైర్హాజరయ్యారు. కేవలం ఎమ్మెల్యేగా ప్రమా ణం చేయడానికి మాత్రమే ఒక్కసారి ఆయన అసెంబ్లీకి వచ్చారు. ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరుపై మళ్లీ చర్చ మొదలైంది.
-
2024-07-25T10:30:58+05:30
తెలంగాణ ప్రజానీకం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2024-25 మరికాసేపట్లో అసెంబ్లీ ముందుకు రాబోతోంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సభలో సమర్పించనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ మీటింగ్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.