CM Revanth Reddy: విద్యుత్ ఒప్పందాలపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
ABN , Publish Date - Jul 29 , 2024 | 01:08 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదవ రోజు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. ఆర్థిక నిర్వహణ , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్‌పై చర్చ జరుగుతుంది. విద్యుత్‌పై సభలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Meetings) ఐదవ రోజు (5th Day) సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. ఆర్థిక నిర్వహణ , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్‌పై చర్చ జరుగుతుంది. విద్యుత్‌పై (Electricity) సభలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt.) విద్యుత్ ఒప్పందాల విషయంలో సత్యహరిశ్చంద్రుడి తరువాత కేసీఆరే (KCR) అన్నట్లు వాళ్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఛత్తీస్ ఘడ్ (Chhattisgarh), యాదాద్రి (Yadadri), భద్రాద్రి (Bhadradri) ఒప్పందాలపై వారే విచారణకు అడిగారని, వాళ్ల కోరిక మేరకే విచారణకు కమిషన్ నియమించామన్నారు.. కమిషన్ వద్దకు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరితే కమిషన్‌పైనే ఆరోపణలు చేశారని విమర్శించారు.
విచారణ కమిషన్ ముందు వాదన వినిపించకుండా కమిషన్ వద్దని కోర్టుకు వెళ్లారని, విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పిందని, అయితే కొత్త కమిషన్ చైర్మన్‌ను నియమించాలని న్యాయస్థానం చెప్పిందని సీఎం రేవంత్ తెలిపారు. విచారణ కమిషన్‌కు కొత్త చైర్మన్‌ను సోమవారం సాయంత్రంలోగా నియమిస్తామన్నారు. తెలంగాణకు వాళ్లే ఏదో కొత్త వెలుగులు తెచ్చినట్లు మాట్లాడుతున్నారని.. వైఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతోనే హైదరాబాద్ నగరానికి నిరంతర విద్యుత్ సరఫరా జరిగిందని, ఏ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ ఆస్తులు సంబంధిత ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని చట్టం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. కానీ ఉత్పత్తి ప్రాతిపదికన కాకుండా, వినియోగ ప్రాతిపదికన విభజన జరగాలని ఆనాడు జైపాల్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించారన్నారు. రాజ్యాంగంలో లేని ప్రత్యేక మినహాయింపు తెలంగాణకు ఇప్పించారని, 53.46 శాతం తెలంగాణకు, 46.54 శాతం ఏపీకి విద్యుత్ పంపిణీ చేసేలా జైపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారని, తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లు కమ్మకుండా చేశారని కొనియాడారు.
ఆనాడు కేసీఆర్ ఎలా సభను తప్పుదోవ పట్టించారో 2015 రికార్డులు తీయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు తాను సభలో మాట్లాడితే సభ నుంచి మార్షల్స్‌తో బయటకు పంపించారన్నారు. సోలార్ ప్రాజెక్ట్ గురించి గొప్పగా చెబుతున్నారు... అవి ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయని, వాళ్ల పాలనలో సోలార్ పవర్ కేవలం ఒక మెగావాట్ మాత్రమేనని అన్నారు. పవర్ ప్లాంట్స్‌కు సంబంధించి ఎలక్ట్రో మెకానికల్ వర్క్, సివిల్ వర్క్ కాంట్రాక్టు విషయంలో వాళ్ల తెలివి ప్రదర్శించారని, గంపగుత్తగా బీహెచ్ఈఎల్‌కు కాంట్రాక్టు అప్పగించారన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి సివిల్ వర్క్స్ మొత్తం వాళ్ల బినామీలు, బంధువులు, అనుయాయులకు ఇచ్చారని ఆరోపించారు. అందులో వేలకోట్ల ఫ్రాడ్ జరిగిందని సీఎం విమర్శించారు. విచారణలో అంతా బయటపడుతుందనే ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారన్నారు.
2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుకు టెండర్ వేస్తే సూపర్ క్రిటికల్ టెండర్ పిలిస్తే కొరియన్, బీహెచ్ఈఎల్, మరో కంపెనీ పాల్గొన్నాయని.. అక్కడ 18 శాతం లెస్‌కు బీహెచ్ఈఎల్ పనులు దక్కించుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ కూడా 18 శాతం లెస్‌కు పనులు చేసే అవకాశం ఉన్నా.. ప్రాజెక్టును నామినేషన్‌పై బీహెచ్ఈఎల్‌కు అప్పగించారన్నారు. అందులో దాదాపు రూ. 8 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు విషయంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో గుజరాత్‌లోని ఇండియా బుల్స్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారని, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించాలని చట్టంలో ఉన్నా ఉల్లంఘించారని విమర్శించారు.
ఇండియా బుల్స్ నుంచి రూ. వెయ్యి కోట్లు మెక్కి కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించారని, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ కట్టాల్సిన చోట కట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వాళ్ల నిర్వాకంతో 16 మంది అధికారులు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రెండేళ్లలో పూర్తి కావాల్సిన పనులు ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొందని, వారి కోరిక మేరకే విచారణ కమిషన్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దొరికిపోయామని అర్ధమైంది కాబట్టే కమిషన్‌పై ఆరోపణలు చేశారన్నారు. కావాలన్నది వాళ్లేనని.. సెగ తగలగానే వద్దన్నది వాళ్లేనని పేర్కొన్నారు. తిన్నింటి వాసాలు లేక్కబెట్టే లక్షణాలు తమకు లేవని.. మీ వాదన ఏంటో కమిషన్ ముందు చెప్పాలన్నారు. ఈరోజు సాయంత్రానికల్లా విచారణ కమిషన్‌కు కొత్త చైర్మన్‌ను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నష్టపోయిన ప్రతి రైతుకు అండగా టీడీపీ
జైపాల్ రెడ్డి సంస్మరణ సభ దృశ్యాలు..(ఫోటో గ్యాలరీ)
ప్రజలు ఛీ కొట్టిన వాళ్ల బుద్ధి మారలేదు..
విశాఖ మేయర్ సీటుపై ఎన్డీయే కన్ను...!
వైఎస్ జగన్‌కు అసలు మ్యూజిక్ స్టార్ట్...
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News