Home » TS Assembly
Telangana: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎనిమిదవ రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు సభలో సాగు నీటి శాఖపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయనుంది.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఎనిమిదవరోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్బంగా ప్రభుత్వం బీసీ కుల గణనపై తీర్మానం ప్రవేశ పెట్టనుంది. దీనిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ జీరో అవర్‌ను మొదలుపెట్టారు.
Telangana: శాసనమండలిలో తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాగ్ రిపోర్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను సిద్ధం చేసింది. డీపీఆర్‌లో రూ.63,352 కోట్లు చూపెట్టగా రూ.1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచారని.. ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉందని కాగ్ తన నివేదికలో పేర్కొంది.
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు ప్రారంభమయ్యాయి. నిన్న సభ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు ప్రయత్నించగా అసెంబ్లీ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఏడవరోజు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇవాళ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. దీనిపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. సభ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు మాట్లాడేందుకు వెళ్తుండగా మార్షల్స్ అభ్యంతరం తెలిపారు.
హైదరాబాద్: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లకుండా భద్రత సిబ్బంది అడ్డుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు ఉపయోగిస్తున్న భాష అభ్యంతరకరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు.. ప్రస్తుత సీఏం రేవంత్ రెడ్డిపై అలాంటి భాష వాడడం బాధాకరమన్నారు