Home » TS Election 2023
ఏఐసీసీ తెలంగాణ సీఎల్పీ నాయకుడిని ప్రకటిస్తుందని మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) పేర్కొన్నారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు హైదరాబాద్‌లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నాయకుడి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేసి పంపించడం జరిగింది. ప్రస్తుతం ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వివిధ కథనాలు ఊహాగానాలు మాత్రమే.. వాటిని ఎవరు నమ్మొద్దని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
జనగామ జిల్లా జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ ( BRS ) పార్టీ అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి ( Pagala Sampath Reddy ) కొద్దిసేపటి క్రితమే గుండెపోటుతో మృతిచెందారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... ‘‘ప్రజల తీర్పును గౌరవిద్దాం. రాజ్యాంగబద్ధంగా జనవరి 16 వరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ( Chevireddy Bhaskar Reddy ) ప్రగతి భవన్‌లో కూర్చొని సర్వే చేసి బీఆర్ఎస్ ( BRS ) పార్టీని ఈ ఎన్నికల్లో ఎలా గెలిపించాలనే దానిపై చర్చించలేదా, బీఆర్ఎస్ గెలుపు కోసం ఆయన పని చేయలేదా అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ( MP Raghurama Krishnaraju ) ప్రశ్నించారు.
తెలంగాణలో అధికార మార్పిడి జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్పొరేషన్ పదవులు అనుభవించిన వారు తమ బాధ్యతల నుంచి ఒక్కొక్కరు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా ఎన్నికల్లో తలపడ్డాయి. చివరకు హస్తం పార్టీ అధికారాన్ని ఛేజిక్కించుకుంది. కాంగ్రెస్-64, బీఆర్ఎస్-39, బీజేపీ-8, ఎంఐఎం-7, ఇతరులు-1 (సీపీఐ) ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. 119 నియోజకవర్గాల్లో గెలుపొందిన విజేతల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
బీఆర్‌ఎ్‌సకు కాలం కలిసిరాలేదు. ప్రకృతి కూడా ఆ పార్టీపై పగబట్టింది. కీలకమైన ఎన్నికల సమయంలో పలు అంశాలు ‘కారు’ పార్టీని ఇరుకున పెట్టాయి. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా చెప్పుకొనే కాళేశ్వరం..
ఒకపక్క కాంగ్రెస్ నుంచి మరో పక్క బీజేపీ నుంచి వచ్చే రాజకీయ ఒత్తిళ్లతో పాటు, వరుసగా రానున్న లోక్‌సభ, మునిసిపల్, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొవడం అంత సులువైన అంశం కాదన్న
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు బీజేపీ అగ్రనేతలు ఉధృత ప్రచారం నిర్వహించినా, మెజారిటీ స్థానాల్లో పోటీ ఇవ్వలేకపోయింది.
రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు ఏఐసీసీ ఢిల్లీ అగ్ర నేతలు రానున్నారు.