Home » TS News
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చెరువురు ఆక్రమణలకు గురయ్యామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముందుగా రాజధాని నగరం హైదరాబాద్‌లో, ఆ తర్వాత అన్ని జిల్లాల్లో చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని తిరిగి చెరువులుగా పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
హైడ్రాకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అటు పొలిటికల్‌గా.. ఇటు సామాన్యుల నుంచి మద్దతు పెద్ద ఎత్తున వస్తోంది. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హైడ్రాకు కావల్సినంత మద్దతును కూడగట్టింది...
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎవరు.. ఎవరు.. అంటూ గత కొన్ని రోజులుగా మీడియా, జనాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీ కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఉండేదే. అంత త్వరగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎవరనేది తేలదు. ఎందుకంటే ఇక్కడ సీనియర్లు ఎక్కువ.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు ఆయన వివరణ మహిళ కమిషన్ ఎదుట వివరణ ఇచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేటీఆర్.. మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చారు.
మహిళా కమిషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ వివరణ ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణ విషయంలో మహిళలపై తాను చేసిన కామెంట్స్ యథాలాపంగా చేసినవే కానీ ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదని కేటీఆర్ వివరణ ఇచ్చారు.
25 వేల మంది పేద విద్యార్థులకు ఉచితంగా ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళ (BAS) పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు.
హైదరాబాద్‌లో గత కొన్నిరోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర నూతన ‘ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)’ నియామకం నేడు, రేపు అంటూ చాలా కాలంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తును ముమ్మరం చేసిందని.. ఇక ప్రకటనే తరువాయి అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది
ఇవాళ అధికార కాంగ్రెస్ పార్టీ, విపక్ష బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ధర్నాలు చేస్తున్నాయి. ఆదాని అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ ధర్నాలకు దిగితే.. రైతుల రుణమాఫీ విషయమై బీఆర్ఎస్ ధర్నాలు చేస్తోంది.
అదానీ అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ నిరసన కార్యక్రమం జరిగింది. సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేయగా.. ఆయన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు.