Home » TSPSC
TSPSC Group 1 Notification 2024: ఇప్పటికే రెండుసార్లు గ్రూప్ 1 ఎగ్జామ్(Group 1 Exam) రద్దవగా.. ఇప్పుడు ఆ నోటిఫికేషనే రద్దైంది. అంతేకాదు.. ఆ పాత నోటిఫికేషన్‌ను క్యాన్సిల్ చేసిన టీఎస్‌పీఎస్‌సీ కొన్ని పోస్టులను పెంచి మొత్తం 563 పోస్టులతో టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) సరికొత్త నోటిఫికేషన్(Group 1 Notification) జారీ చేసింది.
TSPSC Group 1 Notification: తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) గుడ్ న్యూస్ చెప్పింది. 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్(Group 1 Notification) విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. ఈ పోస్టులకు దరఖాస్తులు(Group 1 Applications) ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
TSPSC Group 2 Notification: తెలంగాణ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను(Group 1 Notification) రద్దు చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది టీఎస్పీఎస్సీ.
Telangana: రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీలో మార్పుల కోసం ఒక మెమో తీసుకువచ్చిందని... ఫిబ్రవరి 10 వ తేదీన జీవో నంబర్ 3ను విడుదల చేసిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జీవో నెంబర్ 3 తో మహిళలకు ఇస్తున్న 33.3 శాతం రిజర్వేషన్లు కోల్పోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రోస్టర్ పాయింట్‌లో రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు జీవోలో చెప్పిందని అన్నారు.
తన ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతో కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీఎస్‌పీఎస్సీ చైర్మన్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. అవినీతి ఆరోపణలపై మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1లో మరో 60 పోస్టులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతంలో 503 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
TSPSC Group -1 Notification: తెలంగాణ నిరుద్యోగలకు బిగ్ అలర్ట్. రెండుసార్లు రద్దైన గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి బుధవారం నాడు కీలక ప్రకటన వెలువడనుంది. గతంలో ఉన్న 503 పోస్టులకు మరో 96 పోస్టులు కలిపి మొత్తం 600 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC ) ఛైర్మన్ గా మాజీ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోద ముద్ర వేశారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC ) ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు.
టీఎస్పీఎస్సీ(TSPSC) ఛైర్మన్, సభ్యుల పోస్టుల కోసం భారీగా ఆశావహులు ముందుకొచ్చారు. జనవరి 18తో దరఖాస్తు గడువు ముగిసింది. మొత్తంగా 600కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. జనవరి 20న ఫైనల్ లిస్ట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఛైర్మన్ పోస్ట్ సహా మెంబర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్నవారు సైతం అప్లై చేసుకున్నారు.