Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..
ABN , Publish Date - Apr 06 , 2025 | 03:46 PM
కృష్ణానదిలో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. సరదాగా ఈతకు వెళ్లిన వారంతా ముగిపోయారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

కృష్ణా జిల్లా: శ్రీరామ నవమి వేళ కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ముగ్గురు చిన్నారులు కృష్ణా నదిలో దిగి గల్లంతైన ఘటన అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది. పండగ సందర్భంగా మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు స్నానాల కోసం కృష్ణ నదిలోకి దిగారు. మత్తి వర్ధన్(16), మత్తి కిరణ్(15), మత్తి దొరబాబు(15).. ఆదివారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు.
అయితే వారితోపాటు పెద్దలెవ్వరూ లేకపోవడం, వీరంతా ఈత కొట్టుకుంటూ నది లోపలికి వెళ్లడంతో ముగిపోయారు. వీరి ముగ్గురికీ పెద్దగా ఈత రాకపోవడం, లోతును అంచనా వేయలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చిన్నారుల అరుపులు విని స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి అప్పటికే చేయిదాటి పోయింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్థానికులు, గజ ఈతగాళ్ల సహాయంతో ముగ్గురు చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా, అతి కష్టం మీద మత్తి కిరణ్ మృతదేహం లభ్యమైంది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తమ కుమారులు నదిలో పడిపోడవంతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారుల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మరోవైపు గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే రోజు గల్లంతు కావడంతో మోదుముడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్
Harish Rao: ఉత్తర తెలంగాణకు అద్భుతమైన ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేశారు
Bhadradri: కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం..