Share News

MLA Vamsikrishna: డబ్లిన్‌లో విశాఖ సౌత్ జనసేన ఎమ్మెల్యే 'వంశీకృష్ణ'కు సన్మానం!

ABN , Publish Date - Apr 06 , 2025 | 03:22 PM

అమెరికాలో పర్యటిస్తున్న విశాఖ సౌత్ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణను డబ్లిన్‌లోని స్థానిక ఎన్నారైలు ఘనంగా సన్మానించారు.

MLA Vamsikrishna: డబ్లిన్‌లో విశాఖ సౌత్ జనసేన ఎమ్మెల్యే 'వంశీకృష్ణ'కు సన్మానం!

విశాఖ సౌత్ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాలిఫోర్నియాలోని డబ్లిన్‌లో పర్యటించిన వంశీకృష్ణని బే ఏరియా జనసేన ఎన్నారైలు ఘనంగా సత్కరించారు. పత్తిపాటి సోదరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మూర్తి అంగడాల ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జన సైనికులతోపాటు జనసేన వీరమహిళలు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ గత 9 నెలల కాలంలో ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో జరిగిన డెవలప్మెంట్ ప్రత్యేకించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడంతో పాటు, భోగాపురం ఎయిర్ పోర్టు, పలు ఐటీ కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టడం వంటివి జరిగాయని ఆయన తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల నాయకత్వాన్ని చూసి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు దిగ్గజ కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు.

2.jpg


చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ వల్ల ఏపీకి కంపెనీలు క్యూ కడుతున్నాయని, జగన్ పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిన పెడుతున్నారని చెప్పారు. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను లోకేశ్ అమలు చేస్తున్నారని అన్నారు. విద్యా శాఖలో సమూల మార్పులకు లోకేశ్ శ్రీకారం చుట్టారని చెప్పారు.


ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ చిమట, శివ మొలబంటి, అనిల్ అరిగె, శ్రీకాంత్ కాంచన, మురళి, సుబ్బు, చరణ్, కిరణ్, రావు చెన్న, దుర్గ, శ్రీకాంత్, వెంకట్, సందీప్, తులసి, శ్రీనివాస్, సూర్య మరియు సునీల్  తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

బహ్రెయిన్‌లో ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఒమాన్‌లో మెగాస్టార్ అభిమానుల రక్తదాన శిబిరం

ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 06 , 2025 | 03:24 PM