Indian Stock Markets: ఈ వారం మార్కెట్లు దబిడి దిబిడేనా?
ABN , Publish Date - Apr 06 , 2025 | 02:31 PM
రేపటి నుంచి ప్రారంభమయ్యే మార్కెట్ వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కునే అవకాశాలు కన్పిస్తున్నాయి. టారిఫ్స్ భయాలకు తోడు ఈ వారంలో భారత్ తోపాటు, ప్రపంచ వ్యాప్తంగా చాలా ఈవెంట్లు ఉన్నాయి.

Stock Market This Week: భారత స్టాక్ మార్కెట్లు రేపటి వారం అత్యంత ఒడిదుడుకులతో ఉండే అవకాశం కనిపిస్తోంది. అమెరికా తెచ్చిన పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం.. ప్రపంచ వాణిజ్యాన్ని, తద్వారా ఆయా దేశాల ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తుందని, దీనికి తోడు అమెరికా ఆర్థిక మాంద్య భయాలతో పెట్టుబడిదారులు భయపడుతున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే, వచ్చే వారం RBI వడ్డీ రేటు నిర్ణయం వెలువడుతుండటం, ఈ వారంలో భారతదేశ పారిశ్రామిక, ఉత్పత్తి డేటా కూడా విడుదల కానుంది. అటు, అమెరికా ద్రవ్యోల్బణ డేటా వస్తుండటం వల్ల స్టాక్ మార్కెట్లు అస్థిర పోకడలను ఎదుర్కోవచ్చని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు. అమెరికా సుంకాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణంపై విస్తృత ప్రభావాలను పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు, చైనా యొక్క మార్చి నెల కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) డేటా గురువారం విడుదల కానుంది. యూకే GDP డేటా శుక్రవారం విడుదల కానుంది. ఇక, ఏప్రిల్ 10న TCS ఫలితాలతో Q4 FY25 ఇన్ కం సీజన్ ప్రారంభమవుతుంది. ఈ వారం అమెరికా, భారతదేశం నుండి వెలువడే మార్చి CPI డేటాపై కూడా పెట్టుబడిదారులు దృష్టి సారిస్తారని చెబుతున్నారు.
దీనికి తోడు ఈ వారం విదేశీ పెట్టుబడిదారుల వాణిజ్య కార్యకలాపాలు, రూపాయి-డాలర్ ధోరణి, క్రూడ్ ఆయిల్ ధరలను మార్కెట్లు ఆసక్తిగా పరిశీలిస్తాయని నిపుణులు తెలిపారు. ఈక్విటీ బెంచ్ మార్క్‌లు శుక్రవారం సర్వత్రా అమ్మకాల కారణంగా క్షీణించిన సంగతి తెలిసిందే. ఇక, వచ్చే వారం భారత మార్కెట్లు 4రోజులే పనిచేస్తాయి. ఈక్విటీ మార్కెట్లు గురువారం "శ్రీ మహావీర్ జయంతి" పండుగ సందర్భంగా సెలవు.
ఇవి కూడా చదవండి:
Bhadradri: కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం..
170 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అనంత్ అంబానీ..
Updated Date - Apr 06 , 2025 | 01:51 PM